Hanuman Rudhiramani : హనుమాన్ సినిమాలోని రుధిరమణి వెనుక ఇంత కథ ఉందా.. సినిమా కోసం ఏకంగా అన్ని తయారు చేశారా?

2024 సంవత్సరం చిన్న సినిమాలకు ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.

ఈ ఏడాది విడుదలైన హనుమాన్ మూవీ( Hanuman Movie ) 300 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం, విజువల్ ఎఫెక్స్ట్ కు ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉండటంతో ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి.ఈ సినిమా సక్సెస్ విషయంలో రుధిరమణి( Rudhiramani ) చుట్టూ అల్లుకున్న సీన్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ సినిమా ఆర్ట్ వర్క్ కోసం పని చేసిన టి.నాగేంద్ర( T.Nagendra ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డైరెక్టర్ ప్రశాంత్ కథ చెప్పిన సమయంలోనే అంజనాద్రి కొరకు ప్రత్యేకంగా ప్రపంచాన్ని క్రియేట్ చేయాలని అనుకున్నామని తెలిపారు.ఆ ప్రపంచం ఫాంటసీకి, రియాలిటీకి దగ్గరగా ఉండాలని భావించామని ఆయన చెప్పుకొచ్చారు.

వట్టినాగులపల్లిలోని వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని అక్కడే అంజనాద్రిని( Anjanadri ) సెట్ ల రూపంలో నిర్మించామని నాగేంద్ర కామెంట్లు చేశారు.

Advertisement

హనుమంతుడి రక్త బిందువుతో రుధిరమణిని తయారు చేయడం సవాల్ గా అనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు.హనుమంతుడి రక్త బిందువును రాముని నామంలా పెట్టి మణిని రూపొందించడం జరిగిందని నాగేంద్ర అన్నారు.వందకు పైగా మణులను తయారు చేసి చివరకు ఒక మణిని ఫైనల్ చేశామని ఆయన వెల్లడించారు.

విలన్ ఇంట్రడక్షన్ సీన్ల కోసం డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను వాడుకున్నామని నాగేంద్ర తెలిపారు.

హనుమాన్ మూవీ క్లైమాక్స్ ను( Hanuman Movie Climax ) రామోజీ ఫిల్మ్ సిటీలోని మహర్షి సెట్ లో చేశామని ఈ సినిమా బడ్జెట్ విషయంలో పరిమితులు ఉండటం వల్లే ఏది కావాలో అది పర్ఫెక్ట్ గా సమకూరిందని అనిపిస్తుందని ఆయన కామెంట్లు చేశారు.హనుమాన్ మూవీ 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఇప్పటికే సాధించగా ఈరోజు కూడా ఈ సినిమాకు బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు