నేరేడుచర్ల ఎరువుల దుకాణాలలో తనిఖీలు

సూర్యాపేట జిల్లా:లైసెన్సు ఉన్న ఎరువుల దుకాణాలలో మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని మండల వ్యవసాయ అధికారి జావేద్ అన్నారు.

మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలోని ఎరువుల దుకాణాలను పరిశీలించి, తనిఖీలు నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.రైతులు వరి విత్తనాలు కొనే సమయంలో, తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలన్నారు.

ఆ విత్తన కంపెనీ ప్యాకెట్ కు సంబంధించిన లాట్ నెంబర్ మిగతా వివరాలు అన్నీ కూడా రాసేటట్లు సరి చూసుకోవాలన్నారు.బిల్లులు లేకుండా ఎవరైనా విత్తనాలు అమ్మినట్లు మీ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే మండల వ్యవసాయ అధికారికి సమాచారం ఇవ్వాలన్నారు.

బిల్లులు ఉన్నట్లయితే విత్తనాలలో ఏదైనా సమస్య వచ్చినట్లయితే వారిపై ఫిర్యాదు చేసి,వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవచ్చన్నారు.

Advertisement
వరి కొయ్యలకు మంట పెడితే భూసారం తగ్గుతుంది

Latest Suryapet News