అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు..: మంత్రులు ఉత్తమ్, పొంగులేటి

సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ లో మంత్రులు పర్యటించారు.

ఈ మేరకు రామస్వామి గుట్ట దగ్గర ఇందిరమ్మ ఇళ్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు.గ్రామసభల ద్వారా ఇళ్లను ఎంపిక చేస్తామన్నారు.

గత ప్రభుత్వంలో మొత్తం నియోజకవర్గంలో 240 ఇళ్లే మంజూరు అయ్యాయన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవి కూడా పూర్తిగా నిర్మాణం జరగలేదని తెలిపారు.అవినీతి, అక్రమాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని వెల్లడించారు.

అలాగే 2,160 ఇళ్లను పూర్తి చేసి మూడు నెలల్లో అర్హులకు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఇవి కాకుండానే సుమారు 700 ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

కబ్జా చేసిన భూములు స్వాధీనం చేసుకొని పేదలకు ఇస్తామని హామీ ఇచ్చారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమన్న మంత్రి పొంగులేటి కాళేశ్వరం, సీతారామ, మేడిగడ్డ ప్రాజెక్టులపై విచారణ చేయిస్తామని తెలిపారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు