ఎన్నారై టీచర్‌ని రెండేళ్లు బ్యాన్ చేసిన ఇంగ్లాండ్ స్కూల్స్.. కారణమిదే..

యూకేలోని( UK ) ఓ స్కూల్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా దీప్తి పటేల్ (37)( Dipti Patel ) అనే భారతీయ సంతతికి చెందిన మహిళ పనిచేస్తోంది.

ఈ ఉద్యోగంలో చేరేందుకు ఆమె 2018లో లండన్ నుంచి బోల్టన్‌కు తరలివచ్చింది.

అయితే, ఆమె తనపై మోసం ఆరోపణలను దాచిపెట్టినట్లు తేలింది.తన ఇంటిలోకి తుపాకీతో వచ్చి కొందరు దుండగులు దొంగతనం చేశారని.

అందుకే తాను ఇల్లు మారానని ఆమె ప్రస్తుత స్కూల్లో అబద్ధం చెప్పింది.దొంగిలించిన వస్తువులకు గానూ తన కుటుంబం బీమా క్లెయిమ్( Insurance Claim ) చేసినట్లు ఆమె పాఠశాలకు తెలిపింది.

అయితే ఆమె దోపిడీకి పాల్పడిందని, బీమా క్లెయిమ్ నకిలీదని ఇటీవల తేలింది.దాంతో ఆమెపై మోసం అనే నేరం మోపారు.

Advertisement

నిజానికి ఆమె దోషిగా తేలేంత వరకు పాఠశాలకు అభియోగాల గురించి చెప్పలేదు.అంతేకాదు, ఆమె ఒక ఫారమ్‌పై అబద్ధం చెప్పింది.వాస్తవానికి ఆమెను ఇటీవల బీమా క్లెయిమ్ కేసు విషయమై కోర్టుకు పిలిచినప్పుడు కూడా స్కూల్లో అబద్ధం చెప్పి కోర్టుకు వెళ్ళింది.

అపాయింట్‌మెంట్‌కి పిల్లవాడిని తీసుకెళ్లడానికి తనకు సమయం కావాలని చెప్పింది.అయితే ఆమె అసలు బాగోతం బయటపడటంతో ప్రస్తుత స్కూల్ యాజమాన్యం షాక్ అయింది.అనంతరం టీచర్ల దుష్ప్రవర్తనపై చర్యలు తీసుకునే ప్రత్యేక ఏజెన్సీకి ఆమెపై రిపోర్ట్ చేసింది.

ఒక స్వతంత్ర ప్యానెల్ ఆమె చర్యలను పరిశోధించింది.ఆమె ఒక టీచర్‌ నుంచి సాధారణంగా ఆశించిన ప్రమాణాలను అందుకోలేదని గుర్తించింది.మే 12న, ప్యానెల్ ఆమెను కనీసం రెండేళ్లపాటు బోధించకుండా నిషేధించాలని అభిప్రాయపడింది.

ఈ సిఫార్సుతో ప్రభుత్వం అంగీకరించింది.ఇప్పుడు ఈ నిషేధం ప్రకారం, దీప్తి వచ్చే రెండేళ్లపాటు ఇంగ్లండ్‌లోని ఏ పాఠశాలలో లేదా కళాశాలలో బోధించే అవకాశం లేదు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

ఆమె కావాలంటే ఈ నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు