యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన ఓం రౌత్( Om Raut ) దర్శకత్వంలో రూపొందిన బాలీవుడ్ చిత్రం ఆదిపురుష్ ( Adipurush ) వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.నేడే ఈ సినిమా యొక్క భారీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరగబోతుంది.
ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు నెల రోజుల ముందు నుండే ప్రారంభం అవుతాయని చిత్ర యూనిట్ సభ్యులు మీడియా ముందుకు వస్తారని అంతా భావించారు.కానీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల నిర్వహణలో చిత్ర యూనిట్ సభ్యులు విఫలం అయ్యారు అనిపిస్తుంది.
ఎందుకంటే ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యుల్లో ఏ ఒక్కరు మీడియా ముందుకు వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు.
ప్రభాస్ రెండు మూడు వారాల ముందు నుండే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటాడు అని అంతా భావించారు.కానీ ఇప్పటి వరకు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఆయన ఇవ్వక పోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సినిమా విడుదలకు వారం రోజుల సమయం మాత్రమే ఉండడం తో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ప్రభాస్ సినిమా కు ప్రమోషన్ లేకుండా తీసుకు రావడం ఎంత వరకు న్యాయం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ తో ఈ సినిమా ను 550 కోట్ల రూపాయలతో నిర్మించిన చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలు చేయకుండా విడుదల చేస్తే ఫలితంలో తేడా కొట్టే అవకాశం ఉంది అంటూ కొందరు హెచ్చరిస్తున్నారు.
ఈ విషయం లో చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తయిన తర్వాత చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాల విషయం లో ఏమైనా హడావుడి చేస్తారా అంటే అనుమానమే అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.కేవలం వారం రోజుల్లో ఈ సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాలను ముగిస్తారా అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
కనుక అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా ను రూపొందించడం జరిగింది.అందుకు తగ్గట్లుగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఉండి ఉంటే మరింత బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.