ప్రమాదవశాత్తు భారత ఎన్నారై అమెరికాలోని టెక్సాస్ లో మృతి చెందాడు.అనుకోకుండా జరిగిన ఈ సంఘటన మృతుడి కుటుంభ సభ్యులని తీవ్రంగా కలిచివేస్తోంది.
అప్పటి వరకూ ఎంతో సంతోషంగా ఉన్న వారి కుటుంభంలో విషాదం నిండుకుంది.వివరాలలోకి వెళ్తే.
భారత ఎన్నారై కుటుంభం శనివారం సరదాగా గ్రేప్‌వైన్ సరస్సులో బోటింగ్ చేయడానికి వెళ్లారు ఈలోగా పొంటూన్ బోటు నుంచి ఈత కొట్టడానికి నీళ్లలోకి దూకిన వ్యక్తి ఎంతకూ పైకి రాకపోవడంతో రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు.
Authorities in Grapevine reported that the body of a man who went missing in the Lake Grapevine on Saturday was recovered on Sunday afternoon.The Grapevine Fire Department said divers recovered the body of the victim at 3:35 p.m.The Tarrant County medical examiners office identified the man as 38-year-old Velma Venkatramreddy of Irving, Texas.నీళ్లలో మునిగిపోయిన అతని కోసం రెండు రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు జరిపి 24 గంటల తర్వాత ఆదివారం అతడి మృతదేహాన్ని కనుగొన్నారు.
అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోటులో మొత్తం 12 మంది ఉన్నారు.అయితే అదే రోజున మరొక యువకుడు అదే సరస్సులో పడిపోగా రెస్క్యూ సిబ్బంది కాపాడారు.
అతడిని బెయిలర్ స్కాట్ అండ్ వైట్ మెడికల్ సెంటర్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
అయితే ఈ రెండు ఘటనలకి అసలు కారణం లైఫ్ జాకెట్ ధరించకపోవడం గ్రేప్ వైన్ ఫైర్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ చీఫ్ జాన్ షేర్‌వుడ్ తెలిపారు.ఈ ప్రమాదం దురదృష్టకరమని, బోటింగ్, స్మిమ్మింగ్ చేసే వారు లైఫ్ జాకెట్లు తప్పని సరిగా ధరించి ఉండాలని తెలిపారు.అయితే చనిపోయిన భారత ఎన్నారై అమెరికన్ తెలుగు కన్వెన్షన్ సభ్యులుగా ఉన్నారు.
వెంకట్రాంరెడ్డి భార్య వాని మరియు కుమారుడు రోహన్ రెడ్డి,కూతురు మేధా రెడ్డి లతో డల్లాస్ లో నివాసము ఉంటున్నాడు.వెంకట్రాంరెడ్డి స్వస్థలం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఆరెపల్లి గ్రామం అన్ని తెలుస్తుంది.
ప్రమాదంలో తన జీవితాన్ని కోల్పోయిన వెంకట్రాంరెడ్డి కుటుంబ సభ్యులకు మా సంపూర్ణ సంతాపం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy