వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజల అప్రమత్తంగా ఉండాలి : వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sirisilla District ) వేములవాడ పరిధిలో ఉన్న గంజి వాగును వేములవాడ రూరల్ సి.

ఐ శ్రీనివాస్ తో కలసి పరిశీలించిన ఏఎస్పీ.

ఈ సందర్భంగా ఏఎస్పీ( Sheshadrini Reddy ) మాట్లాడుతూ.జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజల అప్రమత్తంగా ఉండాలని, విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

వాగులు,వంకలు,నదుల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉంటుంది కావున వాటి వద్దకి ఎవరు వెళ్లవద్దని, వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని,వర్షాలు పడేటప్పుడు విద్యుత్ స్తంభాలను గాని,వైర్లను గానీ చేతులతో తాకవద్దన్నారు.వాహనాదారులు వర్షంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు రోడ్లపై నీరు ప్రవహించే చోట అప్రమత్తంగా ఉండాలని,బురద కారణంగా టైర్లు జారి ప్రమాదానికి గురయ్యే అవకాశాలుంటాయన్నారు.

గ్రామాలలో పాత ఇండ్లు, గుడిశ లలో,శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయే పరిస్థితిలో ఉంటే పోలీస్ వారికి సమాచారం అందిస్తే సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామని అన్నారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్ల పై వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఎవరు వెళ్లకుండా రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, బారిగేడ్స్, హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్( Traffic diversion ) చేయాడం జరిగిందన్నారు.

Advertisement
చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

Latest Rajanna Sircilla News