సోమవారం పారిజాత వృక్షాన్ని ఎందుకు పూజిస్తారో తెలుసా?

మన పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సాగర మధనం చేస్తున్నప్పుడు సముద్రగర్భం నుంచి వివిధ వస్తువులతో పాటు పారిజాత వృక్షం కూడా ఉద్భవిస్తుంది.

ఈ పారిజాత వృక్షానికి పూసే పువ్వులు ఎల్లప్పుడూ మెరుస్తూ కాంతివంతంగా వుంటాయి.

సముద్ర గర్భం నుండి ఉద్భవించిన ఈ వృక్షాన్ని ఇంద్రుడు భూలోకానికి తీసుకువచ్చి భూలోకంలో ఉంచినట్లు నమ్ముతారు.ఈ పారిజాత వృక్షాన్ని పూజించడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, ఈ వృక్షం మానవాళికి ఎంతో అవసరమని భావించిన ఇంద్రుడు విష్ణు కోరిక మేరకు పారిజాత వృక్షాన్ని భూగర్భంలోకి తీసుకువస్తాడు.

మహా భారతంలో పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు, అరణ్యంలో నివాసం ఉన్నప్పుడు తన తల్లి కుంతీదేవి శివునికి పూజించడానికి పూలు అందుబాటులో ఉండవు.ఆ సమయంలో అర్జునుడు దేవేంద్రుడిని ఆరాధించి తన తల్లికి పూజ చేయడానికి పారిజాత వృక్షాన్ని ఇవ్వవలసినదిగా కోరుతాడు.

అతని కోరిక మేరకు ఇంద్రుడు పారిజాత వృక్షాన్ని భూలోకానికి పంపినట్లు మహాభారతం తెలియజేస్తుంది.ఇంతటి పవిత్రమైన పారిజాత వృక్షం ఉత్తర ప్రదేశ్ లోని పరాబంకి సమీపంలోని కిందూర్ అనే గ్రామంలో ఉంది.

Advertisement

అలా భూమికి వచ్చిన పారిజాత వృక్షాన్ని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరడంతో పాటు సకల సంపదలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం.పారిజాత వృక్షాని కి పూసే పువ్వులు తెలుపు బంగారు వర్ణంలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

పురాణాలలో ఈ పువ్వులను శివుడి కోసం ఉపయోగించారాని చెప్పడం వల్ల సోమవారం ఈ పారిజాత వృక్షానికి పూజ చేయడం వల్ల ఎంతో మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు.అలాగే ఈ పుష్పాలతో సోమవారం శివుడిని పూజించడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం కలుగు తుంది.

అంతే కాకుండా ఇంతటి పవిత్రమైన పారిజాత పుష్పాల తో ఆ విష్ణు భగవానుడిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

ఎంత తీవ్ర‌మైన హెయిర్ ఫాల్‌కి అయినా అడ్డుక‌ట్ట వేసే సూప‌ర్ రెమెడీ ఇదే!
Advertisement

తాజా వార్తలు