తొలి ఏకాదశి ప్రాముఖ్యత.. ఆ రోజు ఇలా చేయండి..!

మన పూర్వీకులు నియమించిన కొన్ని పర్వ దినాలలో ఏకాదశి( Ekadashi ) ముఖ్యమైనదని కచ్చితంగా చెప్పవచ్చు.

మొత్తం 24 ఏకాదశి తిధుల్లో తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి వంటి వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని పండితులు చెబుతున్నారు.

ఆషాడ మాస ఏకాదశినీ తొలి ఏకాదశిగా ప్రజలు జరుపుకుంటారు.ఈనెల 29వ తేదీన తొలి ఏకాదశి పండుగ ప్రజలు జరుపుకోనున్నారు.

ఈ ఏకాదశినీ శయన ఏకాదశి ( Sayana Ekadashi )అని కూడా అంటారు.ఈ రోజు నుంచి శ్రీమహా విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు.

కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు.ముఖ్యంగా చెప్పాలంటే ఏకాదశి అంటే 11 అని అర్థం వస్తుంది.

Advertisement
Importance Of First Ekadashi Do This On That Day , Ekadashi, Sayana Ekadashi, Sr

త్రిమూర్తులలో శ్రీహరితో ( Srihari )ముడిపడిన ఈ ఏకాదశి మహత్మ్యం గురించి అనేక కథలు మన పురాణాలలో ఉన్నాయి.అష్ట కష్టాలతో తల మునకలవుతున్న మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యథల నుంచి విముక్తి పొందుతారని మరణం తర్వాత వైకుంఠ ప్రాప్తి( Vaikuntha ) లభిస్తుందని పద్మ పురాణంలో ఉంది.

Importance Of First Ekadashi Do This On That Day , Ekadashi, Sayana Ekadashi, Sr

తాళజంఘుడు( Talajunghu ) అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన సంకల్పం వల్ల తన శరీరం నుంచి ఒక కన్యకను జనింపచేస్తాడు.ఆమెనే ఏకాదశి అని పిలుస్తారు.ఆమె విష్ణుమూర్తిని మూడు వరాలు కొరుతుంది.

మొదటిది సదా మీకు ప్రియముగా ఉండాలి.అన్నీ తిథులలో కంటే ప్రముఖంగా ఉండి అందరిచే పూజలు అందుకోవాలి.

మూడవది నా తిధి యందు భక్తితో పూజించి ఉపవాసము చేసిన వారికి మోక్షము లభించాలి అని కోరినట్లు పురాణాలలో ఉంది.

Importance Of First Ekadashi Do This On That Day , Ekadashi, Sayana Ekadashi, Sr
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఇంకా చెప్పాలంటే తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి శ్రీమహావిష్ణువు ( Lord Vishnu )ను ఆరాధించాలి.స్వామివారికి దీపం వెలిగించి, పూలు, పండ్లు నైవేద్యంగా సమర్పించాలి.నైవేద్యంలో తులసీదళాలను సమర్పించాలి.

Advertisement

తొలి ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి తెల్లవారుజామున స్నానాలు ముగించి స్వామి వారిని పూజించి, ప్రసాదం ఆరగించి ఉపవాస దీక్ష విరమించాలి.ఏకాదశి రోజునా మద్యం, మాంసాహారం వంటి వాటికీ దూరంగా ఉండాలి.

ఆరోజు చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు, చెడు చేయకూడదని పండితులు చెబుతున్నారు.

తాజా వార్తలు