బెల్లం, నిమ్మ‌ర‌సం క‌లిపి ఇలా తీసుకుంటే వేగంగా బ‌రువు త‌గ్గుతారు!

బెల్లం, నిమ్మ ర‌సం..

ఈ రెండిటినీ విడి విడిగా నిత్యం వాడుతూనే ఉంటాం.

వేరు వేరు రుచుల‌ను క‌లిగి ఉండే బెల్లం, నిమ్మ ర‌సంలో ఎన్నో పోష‌క విలువ‌లు మ‌రియు ఔష‌ధ గుణాలు నిండి ఉంటాయి.

అవి మ‌న ఆరోగ్యానికి ఎంత‌గానో మేలు చేస్తుంటాయి.అందులోనూ అధిక బ‌రువు స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం అయ్యేవారు బెల్లం, నిమ్మ‌ర‌సం క‌లిపి ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా తీసుకుంటే వేగంగా బ‌రువు త‌గ్గుతారు.

అలాగే మ‌రెన్నో ఆరోగ్య ప్రయోజ‌నాలు సైతం ల‌భిస్తాయి.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం బెల్లం, నిమ్మ‌ర‌సం క‌లిపి ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

Advertisement
If You Take With Jaggery And Lemon Juice Like This, You Will Lose Weight Fast! L

ముందుగా ఒక గ్లాస్ హాట్ వాట‌ర్‌ను తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసి క‌రిగించాలి.బెల్లం పూర్తిగా క‌రిగిపోయాక‌.

అందులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ ర‌సం, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకుని అప్పుడు సేవించాలి.చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే ఈ సూప‌ర్ డ్రింక్‌ను రోజు ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో తీసుకోవాలి.

If You Take With Jaggery And Lemon Juice Like This, You Will Lose Weight Fast L

త‌ద్వారా ఒంట్లో ఉండే కొవ్వు సూప‌ర్ ఫాస్ట్‌గా క‌రుగుతుంది.మెట‌బాలిజం రేటు పెరుగుతుంది.ఫ‌లితంగా వెయిట్ లాస్ అవుతారు.

అంతేకాదండోయ్‌.పైన చెప్పిన విధంగా బెల్లం, నిమ్మ ర‌సం క‌లిపి తీసుకుంటే బ‌ల‌హీన‌మైన రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా మారుతుంది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.

If You Take With Jaggery And Lemon Juice Like This, You Will Lose Weight Fast L
Advertisement

ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి సీజ‌నల్ వ్యాధుల నుండి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.అజీర్ణం, పైత్యం తగ్గుతాయి.లివ‌ర్ శుభ్రంగా త‌యార‌వుతుంది.

మార్నింగ్ సిక్‌నెస్ నుండి మంచి రిలీఫ్ ను పొందొచ్చు.మ‌రియు చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి.

మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.త‌ద్వారా గుండె జ‌బ్బులు సైతం ద‌రి చేర‌కుండా ఉంటాయి.

తాజా వార్తలు