దసరా మూడు సినిమాల కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సినిమా ప్రపంచం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక ఒక్క సినిమా విడుదల అయింది అంటే చాలు ఆ సినిమా రివ్యూ నుంచి కలెక్షన్స్ వరకు తెగ చర్చలు జరుగుతుంటాయి.

ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు మాత్రం ఆ సినిమాలు ఎన్ని రోజులు ఆడాయని.మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఎంత కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి అని బాగా చర్చలు నడుస్తాయి.

అలా ఇప్పటివరకు చాలా సినిమాల కలెక్షన్స్ తెలుసుకున్నాం.ఇక ఇటీవలే దసరా పండగ సందర్భంగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

అందులో రెండు స్టార్ హీరోల సినిమాలు అయితే.మరో సినిమా చిన్న హీరోది.

Advertisement

అయితే ఆ సినిమాలు ఇప్పటివరకు ఎన్ని కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయో.అసలు ఎటువంటి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయో ఓసారి చూద్దాం.

పైగా ఆ సినిమాలు ఏంటంటే.

గాడ్ ఫాదర్:

డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో విడుదలైన మూవీ గాడ్ ఫాదర్.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా మలయాళం రీమేక్ నుండి రాగా మలయాళంలో మంచి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

అయితే తెలుగులో కూడా అటువంటి హిట్టునే అందుకుంటుందని ప్రేక్షకులు బాగా అంచనాలు వేశారు.కానీ సినిమా విడుదలైన మొదటి రోజే ప్రేక్షకులలో నిరాశ కలిగింది.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

బ్లాక్ బస్టర్ హిట్టు కాకుండా కొంతవరకు హిట్ ను సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమాకు విడుదలైన రెండు రోజుల్లో రూ.50 కోట్ల మార్కును దాటింది.ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మూడవరోజు రూ.10 కోట్లు రాబట్టే అవకాశం ఉందని.ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే రూ.69.12 కోట్లు వసూలు చేసిందని తెలిసింది.ఇక ఈ వీకెండ్ లో రూ.100 కోట్లు మార్కులు దాటే అవకాశం ఉందని తెలుస్తుంది.

Advertisement

ది ఘోస్ట్:

ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన చిత్రం ది ఘోస్ట్.ఇక ఈ సినిమా కూడా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ ఈ సినిమా కూడా అంతగా టాక్స్ సొంతం చేసుకోలేదు.తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల కలెక్షన్స్ రూ.3.96 కోట్లను షేర్ ను సొంతం చేసుకుంది.గ్రాస్ పరంగా చూస్తే రూ.7.89కోట్లు, వరల్డ్ వైల్డ్ గా చూస్తే రూ.4.46కోట్లను సొంతం చేసుకుంది.ఇక తెలుగు వర్షన్ కు రూ.22.8 థియేట్రికల్ బిజినెస్ జరగగా.రూ.23 కోట్ల వరకు షేర్ వస్తేనే బ్రేక్ ఈవెన్ వస్తుంది.

స్వాతిముత్యం:

బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ కలిసిన నటించిన మూవీ స్వాతిముత్యం.ఈ సినిమా మాత్రం రెండు పెద్ద సినిమాల మధ్య పోటీగా విడుదలైంది.ఇక ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల కలెక్షన్స్ పరంగా రూ.1.51 కోట్లు వసూల్ అయ్యాయి.వరల్డ్ వైడ్ గా రూ.2.06 కోట్లు కలెక్ట్ చేసుకుంది.ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ మాత్రం 3.84 కోట్ల బిజినెస్ జరగగా.కనీసం నాలుగు కోట్ల వరకు షేర్ వస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది.

తాజా వార్తలు