వారానికి ఒక్కసారి ఇలా షాంపూ చేసుకుంటే జుట్టు రాలడం నుంచి చుండ్రు వరకు అన్ని పరార్!

జుట్టు విపరీతంగా రాలిపోతోందా? చుండ్రు సమస్య వేధిస్తోందా? కురులు గడ్డిలా ఎండిపోయినట్టు మారాయా? జుట్టు తరచూ చిట్లిపోతుందా? అయితే ఇప్పుడు చెప్పబోయే విధంగా షాంపూ చేసుకుంటే ఈ సమస్యలన్నిటికీ సులభంగా చెక్ పెట్టవచ్చు.మ‌రి ఇంకెందుకు ఆలస్యం ఏ విధంగా షాంపూ చేసుకుంటే ఆయా సమస్యలన్నీ పరార్‌ అవుతాయో తెలుసుకుందాం పదండి.

If You Do This Shampoo Once A Week, Hair Problems Will Go Away , Shampooing, Hai

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు రెబ్బల కరివేపాకు( curry leaves ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon juice ), వన్ టేబుల్ స్పూన్ షుగర్( Sugar ), అర కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్ ( Aloe vera gel )వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక గ్లాస్ వాటర్ మరియు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మీ రెగ్యులర్ షాంపూను మిక్స్ చేయాలి.

If You Do This Shampoo Once A Week, Hair Problems Will Go Away , Shampooing, Hai

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ విధంగా షాంపూ చేసుకుంటే జుట్టు రాలడం క్రమంగా అదుపులోకి వస్తుంది.లెమ‌న్ జ్యూస్‌, అలోవెరా లో ఉండే ప్ర‌త్యేక సుగుణాలు చుండ్రు సమస్యను స‌మ‌ర్థ‌వంతంగా నివారిస్తాయి.

అలాగే కరివేపాకు జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.షుగ‌ర్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొల‌గించి స్కాల్ప్ ను శుభ్రంగా, ఆరోగ్యంగా మారుస్తుంది.

Advertisement
If You Do This Shampoo Once A Week, Hair Problems Will Go Away , Shampooing, Hai

హెయిర్ గ్రోత్ ను రెట్టింపు చేస్తుంది.అంతేకాదు వారానికి ఒకసారి ఈ విధంగా షాంపూ చేసుకోవడం వల్ల కురులు స్మూత్ అండ్ షైనీ గా మారతాయి.

If You Do This Shampoo Once A Week, Hair Problems Will Go Away , Shampooing, Hai

జుట్టు తరచూ చిట్లడం, విరగడం వంటివి తగ్గుముఖం పడతాయి.తెల్ల జుట్టు సమస్య త్వరగా దరిచేరకుండా ఉంటుంది.అదే సమయంలో కురులు ఒత్తుగా మరియు పొడుగ్గా సైతం పెరుగుతాయి.

కాబట్టి ఎలాంటి జుట్టు సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పైన చెప్పిన విధంగా షాంపూ చేసుకునేందుకు ప్రయత్నించండి.ఆరోగ్యమైన మరియు ఒత్తైన జుట్టును మీ సొంతం చేసుకోండి.

అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!
Advertisement

తాజా వార్తలు