మోదీని అర్ధం చేసుకున్నా....బాబు అర్థం కావడంలేదు

ప్రధాని నరేంద్ర మోదీని అర్ధం చేసుకున్నా.కాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరొక పార్టీ (వైకాపా) అర్ధం కావడంలేదు.

ఇదీ కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఏపీలోని అనంతపురం జిల్లాలో చేసిన వ్యాఖ్య.ఆయన ఒక్కరోజు పర్యటన కోసం శుక్రవారం అనంతపురం జిల్లాకు వచ్చారు.

పది కిలోమీటర్ల పాదయాత్ర కూడా ప్రారంభించిన రాహుల్‌ రైతులను, స్వయంసహాయక గ్రూపుల మహిళలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీపై రొటీన్‌గా చేస్తున్న విమర్శలే చేశారు.

ఏపీలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబుపై, ప్రతిపక్షం వైకాపా మీద కూడా విమర్శలు గుప్పించారు.మోదీ ఉద్దేశాలు తాను అర్ధం చేసుకున్నానని, కాని చంద్రబాబు నాయుడు ఉద్దేశాలు అర్థం కాకుండా ఉన్నాయన్నారు.

Advertisement

టీడీపీ, వైకాపా ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడటంలేదని ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్టు కోసం ఎందుకు ఉద్యమించడంలేదని నిలదీశారు.

ప్రధాని మోదీ రైతుల భూములు గుంజుకోవాలని చూస్తున్నారని, అదేవిధంగా ప్రత్యేక హోదాను, పోలవరం ప్రాజెక్టును కూడా లాక్కోవాలని (అమలు చేయకుండా) చూస్తున్నారని విమర్శించారు.రైతుల భూములను తీసుకోవాలని నిర్ణయించుకున్న మోదీని పార్లమెంటులో వదిలిపెట్టకూడదని (నిలదీస్తామని అర్ధం) కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకుందన్నారు.

అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు కాంగ్రెసు పార్టీ పోరాడుతుందని హామీ ఇచ్చారు.రాహుల్‌ హామీ ఇచ్చారు కాబట్టి జిల్లా కాంగ్రెసు నాయకులు పోరాటం చేయాల్సి ఉంటుంది.

ప్రత్యేక హోదాపై కాంగ్రెసు నాయకులూ ఉద్యమించాలి.ఇది ఈ రెండు పార్టీల బాధ్యతే కాదు.

ఏపీలో కూటమి గెలుస్తుంది అంటూ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు