ఎన్టీఆర్ సినిమాలో నేను నటించడం లేదు.. సోనాలి బింద్రే క్లారిటీ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత తన 30 వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించారు.

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన వీడియో విడుదల చేయడంతో ఇందులో ఎన్టీఆర్ పాత్ర ఎంతో వైవిధ్యభరితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఇంకా ప్రీప్రొడక్షన్ పనులు, లొకేషన్స్ వెతికే పనిలో చిత్రబృందం నిమగ్నమైనట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ల గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎన్టీఆర్ సరసన నటించడం కోసం సాయి పల్లవి, ఆలియా భట్, జాన్వీ కపూర్ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తున్నప్పటికీ ఈ విషయం గురించి చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.ఇకపోతే తాజాగా ఈ సినిమా ద్వార సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఎంతో మంది స్టార్ హీరోల సరసన అద్భుతమైన సినిమాల్లో నటించి అందరిని మెప్పించిన సోనాలి బింద్రే క్యాన్సర్ తో పోరాడి కోలుకున్నారు.ఈ క్రమంలోనే ఈమె ఎన్టీఆర్ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇస్తారని వార్తలు వచ్చాయి.

I Am Not Acting In Ntr Movie Sonali Bindre Given Clarity , Sonali Bindre, Tollyw
Advertisement
I Am Not Acting In Ntr Movie Sonali Bindre Given Clarity , Sonali Bindre, Tollyw

ఇలా తన గురించి వస్తున్న వార్తలపై సోనాలి బింద్రే స్పందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నో నాకు దీని గురించి ఏమాత్రం తెలియదు.

మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి.ఇది ఫేక్ న్యూస్ అంటూ ఈమె ఎన్టీఆర్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమాలో నటించడం కోసం తనని ఇప్పటివరకు ఎవరూ సంప్రదించలేదని తన గురించి వస్తున్న వార్తలకు సోనాలి బింద్రే చెక్ పెట్టారు.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు