దంతాలను మిలమిలా మెరిపించే తులసి ఆకులు.. ఎలా వాడాలంటే?

దాదాపు ప్రతి ఒక్కరూ తమ దంతాలు తెల్లగా మెరిసిపోతూ కనిపించాలని కోరుకుంటారు.అయితే అందరికీ అది సాధ్యం కాదు.

కొందరి దంతాలు ముత్యాల మాదిరి తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తుంటాయి.కానీ కొందరి దంతాలు మాత్రం పసుపు రంగులో గార పట్టేసి కనిపిస్తుంటాయి.

ఇటువంటి దంతాలు కలిగిన వారు ఇతరులతో మాట్లాడడానికి, నలుగురిలో హాయిగా నువ్వేందుకు సంకోచిస్తుంటారు.ఈ క్రమంలోనే దంతాలను తెల్లగా మార్చుకునేందుకు టూత్ పేస్ట్ ను నెలకు ఒకటి చొప్పున మారుస్తూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు తులసి ఆకులు అద్భుతంగా సహాయపడతాయి.దంతాలను మిలమిలా మెరిపించగల సామర్థ్యం తులసి ఆకులకు ఉంది.

Advertisement
How To Whiten Teeth With Basil Leaves? Basil Leaves, Basil Leaves Benefits, Late

మరి ఇంతకీ తులసి ఆకులను ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా కొన్ని తులసి ఆకులను ఎండలో ఎండబెట్టుకోవాలి.

పూర్తిగా ఎండిన తర్వాత ఆ తులసి ఆకులను( Basil leaves ) మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

How To Whiten Teeth With Basil Leaves Basil Leaves, Basil Leaves Benefits, Late

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ తులసి ఆకుల పొడిని వేసుకోవాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ సాల్ట్( salt ), చిటికెడు పసుపు( Turmeric ) మరియు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు అప్లై చేసుకుని సున్నితంగా రెండు నిమిషాల పాటు తోముకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా దంతాలు మరియు నోటిని క్లీన్ చేసుకోవాలి.

How To Whiten Teeth With Basil Leaves Basil Leaves, Basil Leaves Benefits, Late
ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ఇలా ప్రతిరోజూ కనుక చేస్తే ఎలాంటి గార పట్టిన దంతాలు అయినా సరే కొద్ది రోజుల్లోనే తెల్లగా మారతాయి.కాంతివంతంగా మెరుస్తాయి.పైగా ఈ రెమెడీని పాటిస్తే దంతాలు పుచ్చిపోవడం, చిగుళ్ల నుంచి రక్తస్రావం, చిగుళ్ల వాపు వంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.

Advertisement

దంతాలు దృఢంగా మారతాయి.కాబట్టి పసుపు దంతాలతో బాధపడుతున్న వారు తప్పకుండా తులసి ఆకులతో పైన చెప్పిన విధంగా చేసేందుకు ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు