జుట్టును షాంపూతోనే కాదు..వీటితోనూ వాష్ చేయొచ్చు..తెలుసుకోండి!

పూర్వం జుట్టును వాష్ చేసుకునేందుకు కుంకుడుకాయల‌నే యూజ్ చేసే వారు.

కానీ, నేటి రోజుల్లో పిల్ల‌లు, పెద్ద‌లు, ముస‌లి వారు అనే తేడా లేకుండా అంద‌రూ షాంపూల‌నే వాడుతున్నారు.

షాంపూల్లో కెమిక‌ల్స్ నిండి ఉంటాయ‌ని తెలిసినా వాటినే ఉప‌యోగిస్తున్నారు.అయితే షాంపూతోనే కాదు ఇప్పుడు చెప్ప‌బోయే వాటితోనూ జుట్టును శుభ్రం చేసుకోవ‌చ్చు.

మ‌రి ఏ మాత్రం టైమ్ వేస్ట్ చేయ‌కుండా జుట్టును క్లీన్ చేసే ఆ న్యాచుర‌ల్ షాంపూలు ఏంటో చూసేయండి.మందారం ఆకులు జుట్టుకు ఒక స‌హ‌జ సిద్ధ‌మైన షాంపూలా ఉప‌యోగ‌ప‌డుతుంది.

కొన్ని మందారం ఆకుల‌ను తీసుకుని బాగా ఎండ బెట్టి పొడి చేసి డ‌బ్బా స్టోర్ చేసుకోవాలి.జుట్టుకు జిడ్డుగా అయిన‌ప్పుడు త‌యారు చేసుకున్న మందారం ఆకుల పొడిలో కొద్దిగా వాట‌ర్ మిక్స్ చేసి షాంపూలా వాడుకోవాలి.

Advertisement

ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు శుభ్ర ప‌డ‌ట‌మే కాదు స్మూత్ అండ్ సిల్కీగా కూడా మారుతుంది.ముల్తానీ మ‌ట్టి కూడా జుట్టుకు న్యాచుర‌ల్ క్లీన‌ర్‌గా ప‌ని చేస్తుంది.

కెమిక‌ల్స్ నిండి ఉండే షాంపూకు బదులుగా ముల్తానీ మిట్టిని మీ జుట్టును కడగడానికి ఉపయోగించవచ్చు.ముల్లానీ మ‌ట్టిలో వాట‌ర్ మిక్స్ మిక్స్ చేసి జుట్టుకును క్లీన్ చేసుకుంటే చుండ్రు స‌మ‌స్య త‌గ్గుతుంది.మ‌రియు జుట్టుకు షైనీగా మెరిసి పోతుంది.

ఇక రోజ్ మెరీ ఆకులు సైతం జుట్టును శుభ్రపరిచే ఏజెంట్‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ముందుగా కొన్ని రోజ్ మెరీ ఆకుల‌ను తీసుకుని లైట్‌గా క్ర‌ష్ చేసి నీటిలో నాన బెట్టుకోవాలి.కాసేపు నానిన త‌ర్వాత ఆ నీటిని షాంపూకు బ‌దులుగా జుట్టుకు వాడుకోవ‌చ్చు.

ఈ రోజు మెరీ ఆకుల‌ను యూజ్ చేయ‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్లుగా బ‌లంగా మార‌తాయి.మ‌రియు హెయిర్ త్వ‌ర‌గా వైట్‌గా మార‌కుండా కూడా ఉంటుంది.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు