నిర్ణయం మార్చుకున్న కేసీఆర్ ? వారి బాధ అంతా ఇంతా కాదు ?

టిఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎందుకు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఎవరికీ అర్థం కాదు.ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు ఆ పార్టీ నాయకులు ఎవరు సాహసించలేరు.

 Kcr Postpones Decision On Cabinet Expansion , Kcr ,telangana , Trs , Telangana G-TeluguStop.com

అలా వ్యతిరేకిస్తే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పష్టమైంది.ఇక విషయానికి వస్తే తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ అంశంపై చాలాకాలంగా రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తూనే వస్తున్నాయి.

ముఖ్యంగా కొంత మంది మంత్రుల పనితీరు పై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం, అలాగే కేసీఆర్ కు వారి వ్యవహార శైలి నచ్చక పోవడం తదితర కారణాలతో పాటు,  కొంతమందిని అత్యవసరంగా మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన పరిస్థితి రావడంతో , త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చాలామంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు ఆశలు పెట్టుకున్నారు.దీనికి తగ్గట్టుగానే కేసీఆర్ సైతం మంత్రి వర్గ విస్తరణపై లీకులు ఇస్తూ వచ్చేవారు.

  అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కేసీఆర్ ఉండడం, తదితర కారణాలతో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం లేదనేది టిఆర్ఎస్ లోని కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎన్నికలకు ముందు మంత్రివర్గ విస్తరణ చేపడితే భారీ ఎత్తున అసంతృప్తులు బయటపడతాయని,  వారు ఖచ్చితంగా ఎన్నికల్లో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేస్తారని,  అనవసర తలనొప్పి ఎక్కువ అవుతుంది అని కేసీఆర్ ఒక అభిప్రాయానికి రావడం తో మంత్రివర్గ ప్రక్షాళనకు వెనుకంజ వేస్తున్నట్లు గా ప్రచారం జరుగుతోంది.మంత్రివర్గ విస్తరణ అంటూ చేపడితే,  చాలా ఖాళీలే ఉన్నాయి.ముఖ్యంగా ఈటెల రాజేందర్ మంత్రి  స్థానం ఖాళీ కావడంతో దానిపై ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాష్.

ఆశలు పెట్టుకున్నారు.కానీ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు కేసీఆర్ ఇష్టపడడం లేదు.

ముఖ్యంగా జాతీయ స్థాయి రాజకీయాల పైనే కేసీఆర్ ఎక్కువగా దృష్టి సారించారు.  అక్కడ అనేక రకాల ఇబ్బందులను కెసిఆర్ ఎదుర్కొంటున్నారు.

బీజేపీని కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాకుండా చూడాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ సమయంలో సొంత పార్టీలో రాజకీయ అలజడి సృష్టించడం ఎందుకు అనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు.

అందుకే మంత్రి వర్గ విస్తరణ పై ఈ నిర్ణయం తీసుకున్నారట.కేసీఆర్ తాజా నిర్ణయంపై మంత్రి వర్గ విస్తరణ పై అసలు పెట్టుకున్న ఆశావాహులు మాత్రం తీవ్ర నిరాశా నిస్పృహలోకి వెళ్ళిపోయారట.

Kcr Postpones Decision On Cabinet Expansion

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube