అల్లంతో అన్‌వాంటెడ్ హెయిర్‌ను తొల‌గించ‌వ‌చ్చు..ఎలాగంటే?

ఆడ‌వారిని తీవ్రంగా వేధించే స‌మ‌స్య‌ల్లో అన్‌వాంటెడ్ హెయిర్(అవాంఛిత రోమాలు) ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

చేతులుపై, కాళ్ల‌పై, పెదాల పైభాగంలో, నుదురుపై ఇలా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ అన్‌వాంటెడ్ హెయిర్ ఏర్ప‌డుతుంటుంది.

దాంతో ఆ హెయిర్‌ను తొల‌గించుకోవ‌డం కోసం నానా పాట్లు పాడుతుంటారు.కొంద‌రైతే బ్యూటీ పార్ల‌ర్‌కి వెళ్లి అన్‌వాంటెడ్ హెయిర్‌ను వదిలించుకోవడానికి వేల‌కు వేలు ఖ‌ర్చు పెడుతుంటారు.

అయితే పైసా ఖ‌ర్చు లేకుండా ఇంట్లో ఉండే అల్లంతో కూడా అన్‌వాంటెడ్ హెయిర్‌ను తొల‌గించ‌వ‌చ్చు.మ‌రి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా పెద్ద అల్లం ముక్క‌ను తీసుకుని పైపొట్టును తొల‌గించి.నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి.

Advertisement
How To Unwanted Hair Removed With Ginger? Ginger, Benefits Of Ginger, Ginger For

క‌డిగిన అల్లంను ముక్క‌లుగా క‌ట్ చేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఈ అల్లం పేస్ట్ నుంచి జ్యూస్‌ను మాత్రం వేరు చేసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, హాప్ టేబుల్ స్పూన్ సాల్ట్‌, రెండు టేబుల్ స్పూన్ల పెస‌ర పిండి, హాఫ్‌ టేబుల్ స్పూన్ బియ్యం పిండి మ‌రియు ముందుగా త‌యారు చేసి పెట్టుకున్న‌ అల్లం ర‌సం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

How To Unwanted Hair Removed With Ginger Ginger, Benefits Of Ginger, Ginger For

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని అన్‌వాంటెడ్ హెయిర్ ఉన్న చోట అప్లై చేసి ప‌ది నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం త‌డి చేతుల‌తో స్కిన్‌ను బాగా స్క్ర‌బ్ చేసుకుంటూ గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఆపై ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్‌ను రాసుకోవాలి.

ఇలా మూడు నుంచి ఐదు రోజుల పాటు వ‌ర‌స‌గా చేస్తే గ‌నుక అన్ వాంటెడ్ హెయిర్ కొంచెం కొంచెంగా మొత్తం తొల‌గిపోతుంది.మ‌రియు మ‌ళ్లీ అవాంఛిత రోమాలు రాకుండా కూడా ఉంటాయి.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

కాబ్ట‌టి, ఇక‌పై బ్యూటీ పార్ల‌ర్స్‌లో డ‌బ్బులు త‌గ‌లేసే బ‌దులుగా పైన చెప్పిన సింపుల్ రెమెడీని ట్రై చేసి సుల‌భంగా అన్‌వాంటెడ్ హెయిర్‌ను వ‌దిలించుకోండి.

Advertisement
" autoplay>

తాజా వార్తలు