వేస‌విలో వేధించే త‌ల‌నొప్పికి దూరంగా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే!

వేస‌వి కాలం వ‌చ్చేస్తుంది.గ‌త వారం రోజుల నుంచీ ఎండ‌లు కొంచెం కొంచెంగా పెరుగుతుండ‌టంతో.

ప్ర‌జ‌లు బ‌య‌ట కాలు పెట్టేందుకే భ‌య‌ప‌డుతున్నారు.అయితే వేస‌వి కాలంలో ప్ర‌ధానంగా వేధించే స‌మ‌స్య‌ల్లో త‌ల‌నొప్పి ఒక‌టి.

వేడి వాతావ‌ర‌ణం, డీహైడ్రేష‌న్ వంటి కార‌ణాల వ‌ల్ల‌ త‌ర‌చూ త‌ల‌నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది.దీన్ని త‌గ్గించుకోవ‌డం కోసం పెయిన్ కిల్ల‌ర్స్‌ను తెగ వాడేస్తుంటారు.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే జాగ్ర‌త్త‌లను పాటిస్తే గ‌నుక త‌ల‌నొప్పి మీ ద‌రి దాపుల్లోకి కూడా రాదు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం వేస‌విలో త‌ల‌నొప్పికి దూరంగా ఉండాలంటే ఏయే జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో చూసేయండి.

Advertisement
How To Prevent From Headache In Summer ,headache , Summer , Latest News , Health

స‌మ్మ‌ర్‌లో త‌ల‌నొప్పి ద‌రి చేర‌కూడ‌దంటే శ‌రీరం హైడ్రేటెడ్‌గా ఉండ‌టం ఎంతో అవ‌స‌రం.అందుకే రోజుకు క‌నీసం మూడు నుంచి నాలుగు లీట‌ర్ల నీటిని సేవించాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే కొంద‌రు ఎండ‌ల్లో వ్యాయామాలు చేస్తుంటారు.దీని వ‌ల్ల కూడా త‌ల‌నొప్పి బారిన ప‌డే అవ‌కాశాలు ఉంటాయి.

కాబ‌ట్టి, స‌మ్మ‌ర్‌లో ఉద‌యం 7 గంట‌ల లోపే వ్యాయామాలను పూర్తి చేసుకోవాలి.వేస‌వి కాలంలో సాలిడ్స్ కాకుండా లిక్విడ్స్‌ను అధికంగా తీసుకోవాలి.

ముఖ్యంగా ఫ్రూట్ జ్యూసులు, వెజిటేబుల్ జ్యూసులు, ల‌స్సీలు వంటివి తీసుకుంటే వేస‌వి వేడిని త‌ట్టుకునే శ‌క్తి ల‌భిస్తుంది.మ‌రియు త‌ల‌నొప్పి స‌మ‌స్య‌కు కూడా దూరంగా ఉంటారు.

How To Prevent From Headache In Summer ,headache , Summer , Latest News , Health
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

కూల్‌డ్రింక్స్, సోడాలు, ఆల్క‌హాల్‌, టీ, కాఫీ వంటి పానియాల‌ను తీసుకోవ‌డం పూర్తిగా మానేయాలి.ప్ర‌తి రోజు ఒక గ్లాస్ కొబ్బ‌రి నీళ్ల‌లో నిమ్మ ర‌సం క‌లిపి సేవించాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల మీ బాడీ కూల్‌గా ఉంటుంది.

Advertisement

గంట‌లు గంట‌లు ఏసీలో ఉన్న త‌ల‌నొప్పి వ‌స్తుంది.అందు వ‌ల్ల ఏసీ గ‌దుల్లో ఎక్కువ‌సేపు కూర్చోవ‌డం మానుకోండి.

ఇక వేస‌వి వేడికి బాగా త‌ల‌నొప్పి వ‌స్తుంటే.గంధం చెక్కను నీటి సాయంతో అరగదీసి ఆ పేస్టును నుదుటి మీద అప్లై చేసుకోవాలి.

ఇలా చేస్తే క్ష‌ణాల్లో త‌ల‌నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

తాజా వార్తలు