వినాయకుడికి ఎందుకు మొక్కాలి? అసలు రూపాలెన్ని? 

విఘ్నేశ్వరుడంటేనే విఘ్నములను తొలగించువాడు అని అర్థం.

విఘ్నాలు తొలగాలన్నా, దృష్టి దోషములు పోవాలన్నా, ఆటంకాల నుంచి రక్షణ పొందాలన్నా, విద్య, బుద్ధి, సిద్ధి ప్రాప్తి కలగాలన్నా, బుద్ధి వికాసానికి, వ్యాపారాభివృద్ధికి, మోక్ష ప్రాప్తికి విఘ్నేశ్వరుడి ఆరాధన కచ్చితంగా చేయాలని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే ఎలాంటి పూజలు, పెళ్లిళ్లు, కార్యాలు.చివరకు వ్రతాలు చేయాలనుకున్నా ముందుగా విఘ్నేశ్వురుడి పూజనే చేస్తారు.

పూజకు ఎలాంటి ఆటంకాలు, విఘ్నాలు కల్గకూడదనే ఉద్దేశంతోనే వినాయకుడికి ముందుగా పూజలు చేస్తారు.వ్రతాలు చేసేటప్పుడైతే.

ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి పూజ చేసుకుంటారు.ఆ తర్వాతే మనం చేయాలనుకున్న వ్రతాన్ని ప్రారంభిస్తాం.

Advertisement

విఘ్నేశ్వరుడికి మొత్తం 32 రూపాలు ఉన్నాయి.వీటిలో 16 రూపాలు అత్యంత ప్రాధాన్యమైనవిగా తాంత్రికులు పూజిస్తారని చెబుతారు.అందువల్ల ఈ 16 రూపాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.1.బాలగణపతి 2.తరుణ గణపతి 3.భక్త గణపతి 4.వీర గణపతి 5.శక్తిగణపతి 6.ద్విజ గణపతి 7.సిద్ధి గణపతి 8.ఉచ్ఛిష్ట గణపతి 9.విష్ణు గణపతి 10.క్షిప్త గణపతి, 11.హేరంభ గణపతి 12.లక్ష్మీగణపతి 13.మహాగణపతి 14.విజయ గణపతి 15.రుత్య గణపతి 16.ఊర్ధ్వ గణపతి

ఇలా 16 రూపాల్లో వినాయకుడి పూజ చేస్తారు చాలా మంది.వినాయక చవితి అప్పుడు.ఇలా చాలా రూపాల్లో విగ్రహాలను తయారు చేసి అమ్ముతుంటారు .మనకు నచ్చిన విగ్రహాన్ని, నచ్చిన రూపాన్ని తెచ్చి పూజించుకోవచ్చు.శ్రీ వినాయక వ్రతం శ్లోకం.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే.

టాలీవుడ్ హీరోలను ట్రాప్ చేస్తున్న కోలీవుడ్ డైరెక్టర్స్ ?
Advertisement

తాజా వార్తలు