దగ్గు,జలుబు తక్షణ ఉపశమనం పొందాలంటే....ఇంటి చిట్కాలు

వానాకాలం వచ్చిందంటే దగ్గు,జలుబు రావటం సర్వ సాధారణమే.ఇవి వచ్చాయంటే అంత తొందరగా తగ్గవు.

వీటి బారి నుండి సులభంగా బయట పడాలంటే.మనకు వంటింటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో ఈజీగా బయట పడవచ్చు.

పసుపు

పసుపులో ఉండే యాంటీ సెప్టిక్ లక్షణాలు అనేక వ్యాధుల మీద పోరాటం చేయటంలో సహాయపడతాయి.దగ్గు,జలుబు విపరీతంగా ఉన్నప్పుడు.

ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకొని త్రాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

Cold,cough, Home Remedies, Turmeric For Cold, Cough Remedies, Telugu Health Tips
Advertisement
Cold,Cough, Home Remedies, Turmeric For Cold, Cough Remedies, Telugu Health Tips

మిరియాలు

ఇవి కొంచెం ఘాటుగా ఉన్నా మంచి ప్రభావవంతంగా పనిచేస్తాయి.ఉదయం సమయంలో ఒక స్పూన్ తేనెలో చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకుంటే సాయంత్రం వరకు మంచి ప్రభావం ఉంటుంది.

దాల్చిన చెక్క

దాల్చినచెక్కలో యాంటీ బ్యాక్టీరియా,యాంటీ ఫంగస్,యాంటీ వైరల్ లక్షణాలు ఉండుట వలన జలుబు నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

ఒక స్పూన్ తేనెలో చిటికెడు దాల్చినచెక్క పొడిని కలిపి తీసుకోవాలి.ఈ విధంగా రోజుకి రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.

తులసి

ఈ మొక్క దాదాపుగా అందరి ఇళ్లలోనూ ఉంటుంది.

జలుబు,దగ్గు ఎక్కువగా ఉన్నపుడు తులసి ఆకులను నీటిలో మరిగించి త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.తులసి ఆకులను నమిలిన కూడా ఫలితం కనపడుతుంది.

వయసు పెరిగిన బుద్ది పెరగలేదు.. గుడిలో ఆ నీచం పనులేంటో!
Advertisement

తాజా వార్తలు