ఈతరం హీరోయిన్లలో శ్రీలీలకు మాత్రమే సొంతమైన రికార్డ్ ఇదే.. ఎవరూ టచ్ చేయలేరంటూ?

సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సమయంలో ఒక్కో హీరోయిన్ హవా నడుస్తుంది.

అలా తక్కువ సమయంలో తన క్రేజ్ తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిన హీరోయిన్లలో శ్రీలీల( Sreeleela ) ఒకరు.

గత ఐదు నెలల్లో శ్రీలీల సినిమాలు నెలకు ఒకటి చొప్పున విడుదలయ్యాయి.స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం సినిమాలను శ్రీలీల రిలీజ్ చేయడం జరిగింది.

ఈ ఐదు సినిమాలలో భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించగా మిగతా మూడు సినిమాలు మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

వరుసగా మూడు నెలల్లో మూడు సినిమాలను( Sreeleela Movies ) రిలీజ్ చేయడం మాత్రం శ్రీలీలకే సాధ్యమైందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.శ్రీలీల పారితోషికం( Sreeleela Remuneration ) ప్రస్తుతం 3 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.శ్రీలీల నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా ఆమెకు భారీ హిట్లు దక్కితే ఆమె కెరీర్ మరింత పుంజుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Advertisement

కథ నచ్చని సినిమాలను ఆమె రిజెక్ట్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.శ్రీలీల యంగ్ జనరేషన్ హీరోయిన్లలో అద్భుతంగా డ్యాన్స్ చేసే హీరోయిన్ గా మంచి పేరును సొంతం చేసుకున్నారు.

శ్రీలీల త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ ఉంది.ప్రస్తుతం మెడిసిన్ చదువుతూ బిజీగా ఉన్న శ్రీలీల చదువు పూర్తైన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది.శ్రీలీల ఇతర భాషలపై కూడా ఫోకస్ పెడితే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు