Hero Nikhil Son : ఘనంగా హీరో నిఖిల్ కుమారుడి బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నిఖిల్( Actor Nikhil ) ఒకరు.

హ్యాపీడేస్ సినిమా( Happy Days Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నిఖిల్ అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇటీవల ఈయన నటించిన కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే నిఖిల్ ఇటీవల తండ్రిగా ప్రమోట్ అయిన సంగతి మనకు తెలిసిందే.2021 వ సంవత్సరంలో ఈయన పల్లవి( Pallavi ) అనే ఒక డాక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇలా పెళ్లయినటువంటి ఈ దంపతులు ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు.

తనకు కుమారుడు( Baby Boy ) పుట్టాడని నాన్నే తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చారు అంటూ ఈయన ఎమోషనల్ అవుతూ తన కొడుకు పుట్టిన విషయాన్ని అభిమానులతో పంచుకున్న సంగతి మనకు తెలిసిందే.

Advertisement

ఇకపోతే తాజాగా నిఖిల్ ఇంట మరో వేడుక జరిగింది తన కుమారుడి బారసాల ( Cradle Ceremony ) వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.ప్రస్తుతము ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలను నిఖిల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి.ఇక ఇదే ఫోటోలను నిఖిల్ భార్య పల్లవి కూడా సోషల్ మీడియా( Social Media )లో షేర్ చేస్తూ.

నేడు తమ ముద్దుల కొడుకుకి బారసాల కార్యక్రమం నిర్వహించారు.తొలిసారి ఊయలలో వేయడం, నామకరణం లాంటి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ఈ ఫోటోలని నిఖిల్ సతీమణి పల్లవి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

కానీ కొడుకు ముఖాన్ని మాత్రం రివీల్ చేయలేదు.ఇలా తన కుమారుడికి బారసాల, నామకరణ వేడుక నిర్వహించామని చెప్పిన ఈ జంట తన కొడుకుకి ఏ పేరు పెట్టారా అనే విషయాన్ని మాత్రం వెల్లడించకపోవడంతో అభిమానులు ఏ పేరు పెట్టి ఉంటారని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు