కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ ను( Election Notification ) రిలీజ్ చేసిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సందడి మొదలైంది.దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశలలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో లోక్ సభ ఎన్నికలు ఒకేరోజు జరగనుండటం గమనార్హం.అయితే ఏపీ, తెలంగాణ ఓటర్లు ఓటర్ల జాబితాలో( Voter List ) తమ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే ఓటు వేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండదు.
ఓటర్లు అధికారిక వెబ్ సైట్ https://electoralsearch.eci.gov.in/ ద్వారా ఎలక్టోరల్ రోల్ లో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.ఎపిక్ నంబర్ లేదా మొబైల్ నంబర్, స్టేట్ ఎంచుకోవడం ద్వారా మరింత వేగంగా పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.ఈ వివరాలు లేని వాళ్లు స్టేట్ ఎంటర్ చేసి భాషను ఎంచుకుని పేరు, ఇంటిపేరు, పుట్టినతేదీ, లింగం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేసి పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
ఈ జాబితాలో పేరు ఉన్న వ్యక్తి ఓటర్ స్లిప్ తో( Voter Slip ) పాటు గుర్తింపు కార్డ్ సహాయంతో ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం అయితే ఉంటుంది.ఓటు వేయడానికి వెళ్లే సమయంలో ఐడెంటిటీ ప్రూఫ్( Identity Proof ) కింద ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, జాబ్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ లను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.https://electoralsearch.eci.gov.in/ వెబ్ సైట్ సహాయంతో పోలింగ్ బూత్ వివరాలను సైతం తెలుసుకోవచ్చు.
ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా ఏప్రిల్ 25వ తేదీ నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీగా ఉంది.ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుండగా ఏప్రిల్ 29వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉండనుంది.ఏపీ, తెలంగాణలో మే 13న ఎన్నికలు జరగనుండగా దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.