Aishwarya Dhanush: ఆ స్టార్ హీరోను ఐశ్వర్య పెళ్లి చేసుకోనుందా.. ఇక ధనుష్ కేరీర్ కు ముప్పు తప్పదా?

సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు తమ వ్యక్తిగత విషయాలలో బాగా షాక్ ల మీద షాక్ లు ఇస్తుంటారు.అది కూడా పెళ్లిల విషయంలోనే.

ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత విడిపోవడం.మళ్లీ మరొకరిని పెళ్లి చేసుకోవడం అనేది వాళ్లకు అలవాటు అయ్యింది .ఇప్పటికే ఇండస్ట్రీలలో మంచి క్యూట్ కపుల్ గా ఉన్న నాగచైతన్య, సమంతలు విడిపోయి టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చారు.రీసెంట్గా మెగా డాటర్ నిహారిక కూడా తన భర్తకు విడాకులు ఇచ్చేసింది.

ఇక కోలీవుడ్ లో స్టార్ హీరో ధనుష్( Dhanush ) తన భార్య ఐశ్వర్య కు( Aishwarya ) విడాకులు ఇచ్చి ఆయన షాక్ కు గురి చేశాడు.బాలీవుడ్ లో అమీర్ ఖాన్, కిరణ్ రావుల విడాకుల గురించి కూడా తెలిసిందే.

కొంతమంది నటీనటులు లోలోపలే విడిపోయి బయటకు చెప్పకుండా నిజాలు దాచుతున్నారు.

Advertisement

ఇక వాళ్ళు ఏ కారణాలతో విడిపోతున్నారు అనేది మాత్రం బయటికి రావట్లేదు కానీ.ఆ తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తున్న కొత్త జీవితాల గురించి మాత్రం బాగా వార్తలు వినిపిస్తున్నాయి.అదేంటంటే హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య ఒక స్టార్ హీరో ను( Star Hero ) రెండో పెళ్లి చేసుకోనుందని తెలిసింది.

ధనుష్ 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు.రజనీకాంత్( Rajinikanth ) పెద్ద కూతురు ఐశ్వర్య ధనుష్ ని ఇష్టపడింది.అప్పటికి ఆమె వయసు 23 సంవత్సరాలు.

తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకొని ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా ఈ జంట తమ జీవితంలో ముందుకు సాగారు.

వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఇక తమ పెళ్ళి జరిగి 18 సంవత్సరాలు దాటగా వీరిద్దరు కలిసి సంతోషంగా ఉన్నారు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

కానీ గతంలో ఓ రోజు రాత్రి సమయంలో ధనుష్ ట్విటర్ వేదికగా తాము విడాకులు ( Divorce ) తీసుకుంటున్నామని మీడియా నుంచి ప్రైవసీ కావాలని కోడటంతో అందరూ షాక్ అయ్యారు.పెళ్లయి పిల్లలు ఉన్నాక ఇన్ని సంవత్సరాలకు విడాకులు తీసుకోవడం ఏంటి అని.అసలు విడాకులు తీసుకోవడానికి మీ మధ్య వచ్చిన అంత పెద్ద గొడవ ఏంటి అని చాలామంది ప్రశ్నించారు.అలా కొన్ని రోజుల వరకు వీరి విడాకుల రచ్చ బాగా చర్చగా మారింది.

Advertisement

అయితే కొన్ని రోజుల తర్వాత రజినీకాంత్ వారి ఇద్దరినీ కలిపినట్లు ఇక ఇద్దరు కలిసిపోయి మళ్లీ యధావిధిగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు అని మళ్లీ వార్తలు వచ్చాయి.కానీ తాజాగా ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకుంటుంది అని మళ్ళీ వార్తలు రావడంతో మరింత అనుమానాలు మొదలయ్యాయి.

ఐశ్వర్య ఒక కోలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమాయణం నడిపిస్తుందని.అంతేకాకుండా రీసెంట్ గా తను చెన్నైలోని ఒక రిసార్ట్ లో ఆ యంగ్ హీరోతో కనిపించింది అని వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ఆమె రెండో పెళ్లి చేసుకుంటుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ రజినీకాంత్ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.పైగా తను ఒక స్టార్ హీరో ని పెళ్లి చేసుకుంటుంది అంటే.

ఇక ధనుష్ కెరీర్ కు ముప్పు రావడం ఖాయమని అంటున్నారు.మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ఈ విషయం గురించి ఎవరో ఒకరు స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు