సొంతంగా పోటీ చేసే సత్తా లేదంటూ ప్రతిపక్షాలపై విజయసాయి రెడ్డి ఫైర్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవతరంగా సాగుతున్నాయి.ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు తారస్థాయిలో జరుగుతున్నాయి.

 Vijayasai Reddy Fires On The Opposition Saying That They Do Not Have The Ability-TeluguStop.com

తాజాగా పవన్( Pawan Kalyan ) చేపట్టిన వారాహి రెండో దశ విజయ యాత్ర ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.ఏలూరు నియోజకవర్గంలో రెండో దశ పవన్ వారహీ యాత్ర ఆదివారం నాడు ప్రారంభమైంది.

ఈ సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో వాలంటీర్ల వ్యవస్థ పై పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారంగా మారాయి.

ఈ క్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి( MP Vijaysai Reddy ) ట్విట్టర్ లో ప్రతిపక్షాలను ఉద్దేశించి సంచలన పోస్ట్ పెట్టారు.రాష్ట్రంలో 175 కాదు 150 అసెంబ్లీ స్థానాల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు సొంతంగా పోటీ చేసే సత్తా లేదని సెటైర్ వేశారు.విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్.”175 కాదు…కనీసం 150 అసెంబ్లీ స్థానాల్లో సొంతంగా పోటీ చేసే సత్తా ప్రతిపక్ష పార్టీలకు లేదు.ఈ విషయం ప్రస్తావిస్తే ఒంటిరిగానో, కలిసికట్టుగానో, ఎలా పోటీకిదిగాలో చెప్పాల్సిన అవసరమేంటని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.

సింగిల్ గా బరిలోకి దిగి విజయం సాధించిన వారికే చరిత్రలో స్థానం దొరుకుతుంది” అని ట్విట్టర్ లో మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube