రోడ్లపై వాహనాలు నడుపుతున్న ప్రతి యువకుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఉచిత లైసెన్సు కార్యక్రమం ఉదృతంగా కొనసాగుతుంది.Vdo’s కాలనీ క్యాంపు కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి చొరవతో ప్రమాదాల నివారణ కోసం పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది.
నిన్న ఆన్లైన్ చేసుకున్న వారికి నేడు లెర్నింగ్ లైసెన్స్(LLR) ధృవ పత్రలను సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్వయంగా పత్రలను పంపిణి చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఇటీవలే కాలంలో వాహనాలు విపరీతంగా పెరిగాయని, వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య నాలుగు ఇంతలు పెరిగిందన్నారు.దాన్ని దృష్టిలో ఉంచుకుని 18సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకుడు లైసెన్స్ పొందాలని కోరారు.లైసెన్స్ పొందాలంటే చాలా సమయం వేచి ఉండాలనే కారణంతో చాలా మంది తీసుకోవడానికి నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇలా అనేక మంది వివిధ ఘటనలలో అనుకొని ప్రమాదాల్లో తమ ప్రాణాలను పోగొట్టుకున్నారని పేర్కొన్నారు.
అలాంటి వారి కోసమే డ్రైవింగ్ లో పలు సూచనలు, సురక్షిత డ్రైవింగ్ కోసం లైసెన్స్ తీసుకుని సురక్షితంగా ఉండాలని సూచించారు.ఇప్పటి వరకు నేను చేసిన అనేక కార్యక్రమాల్లో యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వగలగటం చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు.
వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో అనేక పనులు పరిష్కరించపడ్డాయని, వాడ వాడలో పువ్వాడ ఉండడు అని పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని అవి మానుకుంటే మంచిదన్నారు.పువ్వాడ.వాడల్లో కాదు ప్రజల గుండెల్లో ఉన్నాడని, అది తెలిసిన మీరు భయంతో గుండెలు బాదుకుంటున్నరని విమర్శించారు.
కొందరు వక్ర బుద్ధితో ఖమ్మంలో నీచ రాజకీయాలు చేస్తున్నారని, సభ్యసమాజం తలదించుకునే విధంగా రాజకీయాలు చేయడం ద్వారా ప్రజల్లో మీరే పలచన అవుతారని గుర్తుంచుకోవాలన్నారు.
మొత్తం నేడు 103 మంది స్లోట్ బుక్ చేసుకోగా, 156 మందికి LLR ధృవ పత్రలను అందజేశారు.నేటి వరకు మొత్తం 259 మంది LLR లైసెన్స్ పొందారు.
కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, RTO కిషన్ రావు, జిల్లా RTA మెంబర్ వల్లభనేని రామారావు, సుడా చైర్మన్ విజయ్ కుమార్, MVI వరప్రసాద్, RJC కృష్ణ, కార్పొరేటర్ లు నాగండ్ల కోటేశ్వరరావు, సర్పంచ్ మెంటేం రమారావు, దొరెపల్లి శ్వేత, నాయకులు పైడిపల్లి సత్యనారాయణ, పల్వంచ కృష్ణ, తన్నీరు శోబారాణి, తాజుద్దీన్ తదితరులు ఉన్నారు.