వాలంటీర్ల వ్యవస్థపై మరోసారి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వారాహి విజయ యాత్రలో భాగంగా ఆదివారం ఏలూరులో జరిగిన బహిరంగ సభలో వాలంటీర్ వ్యవస్థ పై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.వైసిపి(YCP) అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భారీ ఎత్తున మానవ అక్రమ రవాణా జరగడానికి ప్రధాన కారణం ఈ వాలంటీర్ వ్యవస్థ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Pawan Kalyan Once Again Comments On The Volunteer System, Pawan Kalyan, Janasena-TeluguStop.com

ఈ క్రమంలో సోషల్ మీడియాలో మరోసారి వాలంటీర్ వ్యవస్థపై(Volunteers)పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రజలను అదుపు చేయడానికే వాలంటీర్ వ్యవస్థ అని ఆరోపించారు.

ప్రజల దగ్గర నుండి వాలంటీర్ వ్యవస్థ సహకరిస్తున్న సమాచారం ఎక్కడికో వెళ్తుంది అని విమర్శించారు.ఇన్ని వ్యవస్థలు ఉండగా వాలంటీర్ వ్యవస్థతో పనేంటి అని అన్నారు.

తాను చెప్పేది అందరూ వాలంటీర్ల గురించి కాదు అని వ్యాఖ్యానించారు.కొంతమంది వాలంటీర్లు ప్రజల నుండి సహకరిస్తున్న సమాచారం వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది అని ఆరోపించారు.పదిమంది ఇంటింటికి తిరుగుతుంటే ఎలా.?, వాలంటీర్లకు ₹5000 ఇచ్చి ఇంట్లో దూరే అవకాశం ఇచ్చారు.మీ సమాచారం అంతా వాళ్ళకి తెలుసు.ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అంతా తెలుస్తోంది.మరి ఈ సమాచారం వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంటే ఎలా అని ప్రశ్నించారు.ప్రభుత్వం ఉద్దేశం వేరే అవ్వచ్చు.

సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తే ఎలా అని పవన్ నిలదీశారు.ఈ క్రమంలో సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది.

“వాలంటీర్లు పేరుతో యువత జీవితాలు నాశనం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం.

• 5 వేల రూపాయల వేతనం ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకుంటుంది ఎవరు?
• 4 ఏళ్లుగా ఉద్యోగాలు కల్పించకుండా 5 వేల జీతానికి ఊడిగం చేయిస్తూ బ్రతుకులు నాశనం చేసింది ఎవరు?
• వాలంటీర్ అని మభ్యపెట్టి ప్రభుత్వ ఉద్యోగాల ఊసు ఎత్తకుండా మీ వయస్సు అర్హత లో 4 యేళ్లు నాశనం చేసి అర్హత లేకుండా చేసింది ఎవరు?
• ప్రభుత్వ పథకాల చేరవేత అని చెప్పి, మీ చేత ప్రజల డేటా సేకరిస్తుంది ఎవరు?
• మీ చేత డేటా సేకరించి, దానిని అసాంఘిక కార్యకలాపాలకు వాడుతున్నది ఎవరు?
• మీ జీవితాల్లో ఎదిగే అవకాశాలు లేకుండా చేసి 5 వేల దగ్గరే ఉంచింది ఎవరు?
• వాలంటీర్ వ్యవస్థతో వాలంటీర్ల జీవితాలు మారలేదు, వారిని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు బాగుపడుతున్నారు అనేది వాస్తవం కాదా?
• వైసీపీ సభలు, సమావేశాలకు ప్రజల్ని తీసుకొచ్చే భాధ్యత మీపై వేశారా లేదా?
• మీ ప్రాంతంలో ప్రజలను మీ చేత భయపెట్టిస్తున్నరా లేదా?

ఆలోచించండి గ్రామ వాలంటీర్లు, మీ జీవితాలలో వృద్ది లేకుండా చేస్తున్నాడు ఈ జగన్“(Jagan) అని సోషల్ మీడియాలో పవన్ పోస్ట్ పెట్టడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube