సీఎం జగన్ మేనల్లుడు రాజారెడ్డికి( Rajareddy ) సంబంధించిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు హీరో కటౌట్ అని కామెంట్లు చేశారు.రాజారెడ్డి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే సక్సెస్ కావడంతో సందేహం అవసరం లేదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం కావడం గమనార్హం.
షర్మిల కొడుకు( YS Sharmila Son ) తొలి సినిమాకు పూరీ జగన్నాథ్ డైరెక్టర్ అని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
వైరల్ అవుతున్న ఈ వార్తలు నిజమో కాదో తెలీదు కానీ ఒకవేళ ఈ సినిమాకు పూరీ జగన్నాథ్( Director Puri Jagannath ) దర్శకత్వం వహిస్తే మాత్రం రాజారెడ్డి సులువుగానే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
రాజారెడ్డి విషయంలో షర్మిల ఫ్యామిలీ భలే ప్లాన్ చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉందని తెలుస్తోంది.

మరోవైపు పూరీ జగన్నాథ్ ఈ నెల 12వ తేదీ నుంచి డబుల్ ఇస్మార్ట్ మూవీ( Double Ismart Movie ) షూటింగ్ ను మొదలుపెడుతున్నారు.డబుల్ ఇస్మార్ట్ సినిమాలో మాస్, క్లాస్ ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.లైగర్ సినిమా ఫ్లాపైనా పూరీ జగన్నాథ్ టాలెంట్ ను తక్కువగా అంచనా వేయలేమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పూరీ జగన్నాథ్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.పూరీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే షర్మిల కొడుకు సినీ ఎంట్రీకి సంబంధించి అధికారక ప్రకటన రావచ్చు.వైఎస్ కుటుంబం నుంచి సినిమాల్లోకి రాజారెడ్డి వస్తే ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.
వైఎస్ కుటుంబం రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే.రాబోయే రోజుల్లో సినిమాల్లో కూడా వైఎస్ ఫ్యామిలీ సత్తా చాటుతుందేమో చూడాలి.







