ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానుల కలను బాలయ్య తీరుస్తాడా?

టాలివుడ్ స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈయన వయసు పెరిగే కొద్ది మరింత ఉత్సాహంతో వరుస సినిమాలతో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.

ఇటీవల బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలు అన్ని 50 రోజులు థియేటర్లలో ఉండటమే గగనమైపోయింది.

అటువంటిది అఖండ సినిమా ఏకంగా 100 రోజులు ఆడి కొత్త రికార్డులను సృష్టించింది.ఈ సినిమాలో అఘోరాలా బాలకృష్ణ నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.

అయితే ప్రస్తుతం బాలకృష్ణ 110 వ సినిమాకీ చేరువలో ఉన్నాడు.ఎన్నో సినిమాలలో తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న బాలకృష్ణ ఇటీవల హోస్ట్ గా కూడా తన సత్తా నిరూపించుకున్నాడు.

Advertisement
Hero Balakrishna Fulfill The Fans Dreams Details, Balakrishna, Tollywood, Fans,

ఓటీటీలో స్ట్రీమ్ అయిన " అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె " షో కి హోస్ట్ గా వ్యవహరించాడు.ఇలా నటుడిగా, వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు పొందిన బాలకృష్ణ నుంచీ ఆయన అభిమానులు మరోకటి కోరుకుంటున్నారు.

తమ అభిమాన హీరోని దర్శకుడిగా చూడాలని ఎన్నో ఏళ్లుగా ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.బాలకృష్ణ ఇప్పటివరకు పూర్తీ గా ఒక్క సినిమాకి కూడా దర్శకత్వం వహించలేదు.

Hero Balakrishna Fulfill The Fans Dreams Details, Balakrishna, Tollywood, Fans,

అందువల్ల స్వయంగా ఆయన నటించే సినిమాకి స్వయంగా దర్శకత్వం వహించాలని, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని కోట్ల మంది అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.గతంలో బాలకృష్ణ త‌న తండ్రి ఎన్టీఆర్ హీరోగా నటించిన ఓ సినిమాను డైరెక్ట్ చేయాల్సి ఉంది.కానీ అది సాధ్యం కాలేదు.

ఆ త‌ర్వాత బాల‌య్య ద‌ర్శ‌క‌త్వంలో నర్త‌న‌శాల సినిమా ప్రారంభ‌మైంది.కానీ ఆ సమయంలో న‌టి సౌంద‌ర్య మ‌ర‌ణంతో ఆ సినిమా కూడా ఆగిపోయింది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

మరి బాలకృష్ణ తన అభిమానుల కోరికని ఎప్పుడు నెరవేరుస్తాడో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు