కురులకు అండగా కరివేపాకు.. ఇలా వాడితే మస్తు లాభాలు!

కరివేపాకు( curry leaves ) గురించి పరిచయాలు అక్కర్లేదు.దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కరివేపాకుని విరివిగా ఉపయోగిస్తారు.

రోజువారి కూరల్లో కచ్చితంగా కరివేపాకు పడాల్సిందే.ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను అందించే కరివేపాకు.

కురుల సంరక్షణకు సైతం అండగా ఉంటుంది.ముఖ్యంగా కరివేపాకును ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మస్తు లాభాలు పొందుతారు.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు ఫ్రెష్ కరివేపాకు, అరకప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో చూసి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.

Advertisement

ఈ కరివేపాకు జ్యూస్ లో వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( vitamin E oil ), వన్ టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ( Almond oil )వేసి బాగా మిక్స్ చేస్తే మంచి హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.ఒక స్ప్రే బాటిల్ లో ఈ టానిక్ ను నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ విధంగా చేస్తే చాలా బెనిఫిట్స్ పొందుతారు.కరివేపాకు జుట్టుకు అవసరమైన ఖనిజాలు, విటమిన్లు మరియు ప్రోటీన్లు అందిస్తుంది.జుట్టు పెరుగుదల‌ను ప్రోత్స‌హిస్తుంది.

కరివేపాకులో ఉండే విటమిన్ బి మరియు కాల్షియం జుట్టు రాలిపోవడాన్ని నియంత్రిస్తాయి.యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ ( Antifungal and antibacterial )గుణాలను కలిగి ఉండ‌టం వ‌ల్ల స్కాల్ప్‌ ఇన్ఫెక్షన్లను నివారించడంలో క‌రివేపాకు సహాయపడుతుంది.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
కిడ్నీలో రాళ్లు ఉన్నాయా.. అయితే మీ డైట్ లో ఇది కచ్చితంగా ఉండాల్సిందే!

ఇటీవ‌ల కాలంలో చాలా మంది చిన్న వ‌య‌సులోనే తెల్ల జుట్టు స‌మ‌స్య‌ను ఫేస్ చేస్తున్నారు.అయితే కరివేపాకులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు త్వ‌ర‌గా నెరసిపోకుండా నిరోధిస్తాయి.వ‌య‌సు పైబ‌డిన జుట్టు న‌ల్ల‌గా మెరిసేలా ప్రోత్స‌హిస్తాయి.

Advertisement

అంతేకాదండోయ్‌.వారానికి ఒక‌సారి క‌రివేపాకును పైన చెప్పిన విధంగా కురుల‌కు ఉప‌యోగిస్తే.

హెయిర్ రూట్స్ స్ట్రోంగ్ గా మార‌తాయి.చుండ్రు స‌మ‌స్య దూరం అవుతుంది.

జుట్టు రాల‌డం త‌గ్గి ఒత్తుగా, పొడుగ్గా పెర‌గ‌డం ప్రారంభ‌మ‌వుతుంది.

తాజా వార్తలు