అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి కుమారి 21ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా హైప్ సొంతం చేసుకున్న నటి హెబ్బా పటేల్.
ఈ అమ్మడు కెరియర్ ఆరంభంలోనే అదిరిపోయే పాత్రతో పాపులారిటీ సొంతం చేసుకున్న తరువాత ఆ క్రేజ్ ని కొనసాగించడంలో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
ఒకే తరహా పాత్రలు రావడం వలన తనలోని నటిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించుకోలేకపోయింది.చాలా సినిమాలలో ఆమె పాత్రల శైలి పూర్తిగా కుమారి 21ఎఫ్ తరహాలోనే ఉంటాయి.
ఈ కారణంగా చేత గ్లామర్ ప్రదర్శనలు చేసిన క్రేజీ హీరోయిన్ గా హెబ్బా కొనసాగలేకపోయింది.అయితే ఈ అమ్మడుకి సక్సెస్ రేట్ తక్కువానే ఉన్న ఇప్పటికి అడపాదడపా సినిమా అవకాశాలు వస్తున్నాయి.
మరో వైపు ఇప్పటికే వెబ్ సిరీస్ లలో కూడా ఎంట్రీ ఇచ్చి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో కెరియర్ ని బిల్డ్ చేసుకునే పనిలో ఉంది.ఇదిలా ఉంటే ఈ అమ్మడు కొత్త సినిమాకి సంబందించిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం సంపత్ నంది కథతో తెరకెక్కిన ఒదేలు రైల్వేస్టేషన్ అనే సినిమాలో హెబ్బా మొదటి సారి డీగ్లామర్ పాత్రలో నటిస్తుంది.పక్కా తెలంగాణ అమ్మాయిగా ఈ సినిమాలో కనిపిస్తుంది.
ఇప్పుడు మరో కొత్త సినిమాకి ఈ భామ ఒకే చెప్పింది.తెలిసినవాళ్ళు అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.
ఈ టైటిల్ పోస్టర్ ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ పాతకాలపు కుర్చీలో ఓ అమ్మాయి మెడ మీద తల లేకుండా కూర్చొని ఉంది.
గోడ మీద ఆ తల ఫోటో రూపంలో ఉంది.అందులో హెబ్బా పటేల్ లుక్ ఉంది.
ఈ పోస్టర్ లుక్, టైటిల్ బట్టి క్రైమ్, హర్రర్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.తెలిసినవాళ్ళు అనే టైటిల్ ద్వారా తనకి భాగా పరిచయం ఉన్న వారి చేతిలో హత్య చేయబడ్డ ఓ అమ్మాయి ఆత్మగా మారి వారి మీద ఎలా రివెంజ్ తీర్చుకుంది అనే కాన్సెప్ట్ తో తెరకేక్కుతున్నట్లు కనిపిస్తుంది.
ఈ సినిమాతో విప్లవ్ కోనేటి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.డిఫరెంట్ కాన్సెప్ట్ తో మరోసారి డీ గ్లామర్ రోల్స్ లో ఈ సినిమాలో హెబ్బా సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy