ఆడ‌వారు రెగ్యుల‌ర్‌గా మెంతికూర తింటే ఏం అవుతుందో తెలుసా?

ఆకుకూర‌ల్లో ఒక‌టైన మెంతి కూర గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.ఈ వింట‌ర్ సీజ‌న్‌లో మింతి కూర విరి విరిగా ల‌భిస్తుంది.

మ‌న దేశంలో మెంతుల కంటే మెంతి కూర‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు.కొందరైతే మెంతి కూర‌ను పెర‌టిలో కూడా పెంచుకుంటుంటారు.

ఎన్నో పోష‌కాలు దాగి ఉన్న మెంతి కూర డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల అనేక జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చు.ముఖ్యంగా ఆడ‌వారు రెగ్యుల‌ర్‌గా మెంతి కూర తీసుకోవ‌డం వ‌ల్ల బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాలు చేకూర‌తాయి.

సాధార‌ణంగా మ‌గవారితో పోలిస్తే.ఆడ‌వారిలోనే న‌డుపు నొప్పి ఎక్కువ‌గా క‌నిస్తుంది.

Advertisement

ఈ న‌డుపు నొప్పి కార‌ణంగా చిన్న చిన్న ప‌నులు కూడా చేయ‌లేక‌పోతుంటారు.అయితే రెగ్యుల‌ర్‌గా త‌గిన మోతాదులో మెంతి కూర తీసుకుంటే గ‌నుక‌.

అందులో ఉండే ప‌లు పోష‌కాలు న‌డుము నొప్పిని క్ర‌మంగా త‌గ్గిస్తాయి.అలాగే ఆడ‌వారిని ప్ర‌తి నెల ప‌ల‌క‌రించే పీరియ‌డ్స్ ఎంతో ఇబ్బందిక‌రంగా ఉంటాయి.

ముఖ్యంగా ఆ స‌మ‌యంలో వ‌చ్చే క‌డుపు నొప్పి భ‌రించ‌లేనంత బాధ‌క‌రంగా ఉంటుంది.

అయితే రెగ్యుల‌ర్‌గా మెంతి కూర తీసుకుంటే.నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే క‌డుపు నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.ఇక అధిక బ‌రువు ఎదుర్కొంటున్న వారిలో మ‌హిళ‌లే ఎక్కువ‌గా ఉంటున్నారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మ‌హిళ‌లు బ‌రువు పెరిగిపోతుంటారు.అయితే బ‌రువు త‌గ్గాలి అని భావించే వారు.

Advertisement

త‌గిన మోతాదులో మెంతి కూర తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.ఎందుకంటే, మెంతి కూర‌లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది.

ఫైబ‌ర్ ఉండే ఏ ఆహారం తీసుకున్నా బ‌రువు త‌గ్గొచ్చు.ఇక ర‌క్త హీన‌త స‌మ‌స్య‌తో బాధ ప‌డే ఆడ‌వారు ప్ర‌తి రోజు మెంతి కూర తీసుకంటే.

అందులో ఉండే ఐర‌న్ కంటెంట్ ర‌క్త వృద్ధి జ‌రిగేలా చేస్తుంది.అలాగే మెంతి కూర రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ఈ వింట‌ర్ సీజ‌న్‌లో ఎదుర‌య్యే చ‌ర్మ స‌మ‌స్య‌ల నుంచి కూడా ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

తాజా వార్తలు