చిక్కుడుకాయపై చిన్న చూపు వద్దు.. ఈ విషయాలు తెలిస్తే షాకైపోతారు!

చాలా ఆరోగ్యకరమైన కూరగాయల్లో చిక్కుడుకాయ( Cluster Beans ) ఒక‌టి.కానీ కొంద‌రు చిక్కుడుకాయ‌ను తిన‌డానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌తారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇక‌పై చిక్కుడుకాయను చిన్న చూపు చూడొద్దు.చిక్కుడుకాయ తక్కువ ఖరీదుకే ల‌భించినా.

అది అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి తెలుసుకుంటే షాకైపోతారు.మ‌న శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ముఖ్య‌మైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబ‌ర్‌ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చిక్కుడుకాయ‌లో నిండి ఉంటాయి.

ఈ కూర‌గాయ‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల బోలెడు ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.షుగ‌ర్ పేషెంట్లు వారానికి ఒక్క‌సారి అయినా చిక్కుడుకాయ‌ను తినేందుకు ప్ర‌య‌త్నించాలి.

Advertisement
Health Benefits Of Eating Cluster Beans Details, Cluster Beans, Cluster Beans H

లో-గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల చిక్కుడుకాయ రక్తంలో షుగర్ స్థాయులను నియంత్రిస్తుంది.చిక్కుడుకాయ‌లోని అధిక ఫైబ‌ర్ కంటెంట్ కార‌ణంగా గ్లూకోజ్ శరీరంలో నెమ్మదిగా విడుదల అవుతుంది.

అందువ‌ల్ల షుగ‌ర్ వ్యాధి( Diabetes ) ఉన్న‌వారికి చిక్కుడుకాయ తిన‌ద‌గ్గ కూర‌గాయ‌.

Health Benefits Of Eating Cluster Beans Details, Cluster Beans, Cluster Beans H

అలాగే చిక్కుడుకాయ‌లో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది.ర‌క్త‌హీన‌త‌తో( Anemia ) బాధ‌ప‌డుతున్న‌వారు చిక్కుడుకాయ‌ను తీసుకుంటే.శ‌రీరంలో హీమోగ్లోబిన్ స్థాయులు మెరుగుప‌డ‌తాయి.

ర‌క్త‌హీన‌త దూరం అవుతుంది.ఫోలేట్ అధికంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు( Pregnant Woman ) కూడా చిక్కుడుకాయ ఎంతో మేలు చేస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి11, మంగళవారం 2025
విజయ్ దేవరకొండ చేస్తున్న రౌడీ జనార్ధన్ పరిస్థితి ఏంటి..?

గర్భంలో శిశువు అభివృద్ధికి చిక్కుడు స‌హాయ‌ప‌డుతుంది.

Health Benefits Of Eating Cluster Beans Details, Cluster Beans, Cluster Beans H
Advertisement

కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఉండటం వల్ల చిక్కుడు ఎముకలను బలంగా ఉంచుతుంది.వయస్సు పెరిగే కొద్దీ త‌లెత్తే ఎముకల నష్టాన్ని త‌గ్గిస్తుంది.అధిక కొలెస్ట్రాల్ ఉన్న‌వారు వారానికి రెండుసార్లు అయినా చిక్కుడుకాయ‌ను తీసుకోవాలి.

ఎందుకంటే, కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించే సామ‌ర్థ్యం చిక్కుడుకు ఉంది.పైగా చిక్కుడుకాయలో పొటాషియం రక్తపోటును తగ్గించి గుండె సంబంధిత సమస్యలు వ‌చ్చే ప్ర‌మాదాన్ని త‌గ్గిస్తుంది.

వెయిట్ లాస్( Weight Loss ) అయ్యేందుకు డైట్ ఫాలో అవుతున్న వారు చిక్కుడుకాయ‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం మంచి ఎంపిక అవుతుంది.చిక్కుడుకాయ‌లో కేలరీలు త‌క్కువ‌గా ఫైబర్ ఎక్కువ‌గా ఉంటాయి.

చిక్కుడుకాయ‌ను తినడం వల్ల పొట్ట త్వరగా నిండిన భావన కలుగుతుంది.ఇది ఎక్కువ ఆహారం తినకుండా ఉండటానికి సహాయపడుతుంది.

ఫ‌లితంగా వెయిట్ లాస్ అవుతారు.

తాజా వార్తలు