వింట‌ర్ లో విచ్చ‌ద‌నాన్ని ఇచ్చే అల్లం టీ.. రోజూ తాగితే మస్తు లాభాలు..!

ప్రస్తుతం వింటర్ సీజన్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్ లో చలి తీవ్రత తట్టుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.

బయటికి రావాలంటేనే భయపడుతుంటారు.అయితే వింటర్‌ లో ఒంటికి మంచి వెచ్చదనాన్ని ఇచ్చేందుకు అల్లం టీ అద్భుతంగా సహాయపడుతుంది.

నిత్యం ఒక కప్పు అల్లం టీ ( Ginger tea )తాగితే మస్తు ఆరోగ్య లాభాలు పొందవచ్చని నిపుణులు కూడా చెబుతున్నారు.అల్లం టీ తయారు చేసుకోవడం ఎంతో సులభం.

అందుకోసం ముందుగా అంగుళం అల్లం ముక్క తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

Advertisement

వాటర్ హీట్ అయ్యాక అల్లం తురుము( Grate ginger ) వేసి ఐదారు నిమిషాల పాటు మరిగిస్తే అల్లం టీ సిద్ధమవుతుంది.స్టైనర్ సహాయంతో టీను ఫిల్టర్ చేసుకుని రుచికి సరిపడా తేనె కలిపి సేవించడమే.

అల్లం టీలో ఎటువంటి కెఫీన్( Caffeine ) ఉండ‌దు.అందువ‌ల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.అల్లం టీ థర్మోజెనిక్ ( Tea is thermogenic )లక్షణాలను కలిగి ఉంటుంది.

ఇది సహజంగా చల్లని వాతావరణంలో శరీరాన్ని వేడి చేస్తుంది.శీతాకాలంలో నిత్యం అల్లం టీ తాగితే చ‌లిపులి త‌ట్టుకునే స‌మ‌ర్థ్యం ల‌భిస్తుంది.

అలాగే అల్లంలోని యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.జలుబు మరియు ఫ్లూ వంటి స‌మ‌స్య‌ల‌కు వ్య‌తిరేఖంగా పోరాడతాయి.

అక్కినేని అఖిల్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా.. ఆరోజే పెళ్లి బాజాలు మోగనున్నాయా?
చరణ్ కియరా జోడికి కలసి రాలేదా...అప్పుడు అలా... ఇప్పుడు ఇలా?

అల్లం టీ గొంతు నొప్పి, వాపును త‌గ్గిండ‌చంలో న్యాచుర‌ల్ మెడిసిన్ లా ప‌ని చేస్తుంది.నాసికా రద్దీ ని క్లియర్ చేస్తుంది.చ‌లికాలంలో వేధించే శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

Advertisement

అంతేకాదండోయ్‌, అల్లం టీ జీర్ణ‌క్రియ ప‌నితీరును పెంచుతుంది.అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్ వంటి జీర్ణ స‌మ‌స్య‌ల‌కు అడ్డుక‌ట్ట వేస్తుంది.

ఇక చల్లని వాతావరణంలో సాధారణంగా ఉండే కీళ్ల నొప్పులను దూరం చేయ‌డంలోనూ అల్లం టీ ఉప‌యోగ‌ప‌డుతుంది.

తాజా వార్తలు