మనలో చాలా మందిని చాలా కామన్ గా కలవర పెట్టే చర్మ సమస్యల్లో డార్క్ స్పాట్స్( Dark spots ) ముందు వరుసలో ఉంటాయి.ముఖంపై అక్కడక్కడ కనిపించే నల్లటి మచ్చలు అందాన్ని ఎంతలా పాడు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే నల్ల మచ్చలు ఎంత అసహ్యంగా కనిపిస్తాయో కళ్ళ చుట్టూ ఏర్పడే డార్క్ సర్కిల్స్ కూడా అంతే అసహ్యంగా కనిపిస్తాయి.ఒకవేళ మీరు ఈ రెండు సమస్యలతోనూ బాధపడుతుంటే అస్సలు వర్రీ అవ్వకండి.
ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీ డార్క్ స్పాట్స్ ను తొలగించడమే కాకుండా డార్క్ సర్కిల్స్ ను సైతం దూరం చేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ( aloe vera gel )వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ స్వచ్ఛమైన తేనె( honey ) మరియు వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ లెమన్ జ్యూస్ లేదా ఆరెంజ్ జ్యూస్ ( Orange juice )వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు కళ్ల చుట్టూ అప్లై చేసుకుని సున్నితంగా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆపై మరో పది నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఈ సింపుల్ రెమెడీని రెగ్యులర్ గా కనుక పాటించారంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.లెమన్ జ్యూస్ లో మెలనిన్‌ను విచ్ఛిన్నం చేసి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసే యాసిడ్‌లు మరియు విటమిన్ సి నిండి ఉంటాయి.అలాగే తేనె లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి డార్క్ స్పాట్స్ కు వ్యతిరేకంగా పోరాడతాయి.చర్మంపై మచ్చలను క్రమంగా మాయం చేస్తాయి.అదే సమయంలో కళ్లు చూట్టూ ఏర్పడిన నల్లటి వలయాలను సైతం దూరం చేస్తాయి.
ఇక అలోవెరా జెల్ చర్మానికి చక్కని పోషణ అందిస్తుంది.మచ్చలకు కారణమయ్యే మొటిమలకు అడ్డుకట్ట వేస్తుంది.
స్కిన్ ను హైడ్రేట్ గా ఉంచుతుంది.నల్లటి వలయాలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.