వయసు పైబడే కొద్ది నల్ల జుట్టు( black hair ) తెల్లబడటం అనేది చాలా కామన్.అయితే ఇటీవల రోజుల్లో కొందరు పాతిక, ముప్పై ఏళ్లకే తెల్ల జుట్టు సమస్యను ఫేస్ చేస్తున్నారు.
ఒత్తిడి, పోషకాల కొరత, పొల్యూషన్, ఆటో ఇమ్యూన్ వ్యాధి, ధూమపానం, థైరాయిడ్ రుగ్మతలు, జెనెటిక్స్ ( Thyroid disorders, genetics )ఇలా రకరకాల అంశాలు జుట్టు తెల్లబడటానికి కారణం అవుతుంటాయి.వైట్ హెయిర్ వచ్చాక బాధపడటం కన్నా రాకుండా మందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.
ముఖ్యంగా పర్మినెంట్ బ్లాక్ హెయిర్ ను కోరుకునే వారు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ ని అస్సలు మిస్ అవ్వకండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు ఉల్లి తొక్కలు, నాలుగు రెబ్బలు ఎండిన కరివేపాకు( curry leaves ), వన్ టేబుల్ స్పూన్ మెంతులు, రెండు టేబుల్ స్పూన్లు ఎండిన ఉసిరికాయ ముక్కలు వేసి పూర్తిగా నల్లగా మారేంతవరకు వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న పదార్థాలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పౌడర్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ), వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )మరియు సరిపడా రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.నెలకొకసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటించారంటే తెల్ల జుట్టు మీ వంక కూడా చూడదు.వయసు పైబడిన మీ కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాయి.ఒకవేళ ఇప్పటికే తెల్ల జుట్టు తో బాధపడుతుంటే వారు కూడా ఈ రెమెడీని ప్రయత్నించవచ్చు.వారానికి ఒకసారి పైన చెప్పుకున్న హెయిర్ మాస్క్ ను కనుక వేసుకుంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.







