ఏడాది పొడవునా లభించే అతి చౌకైన పండ్లలో అరటిపండు( banana ) ముందు వరుసలో ఉంటుంది.ధర తక్కువే అయినా పోషకాలు మాత్రం అరటి పండులో మెండుగా ఉంటాయి.
అయితే అరటి పండ్లు రుతుక్రమ అసౌకర్యాన్ని దూరం చేయడంలో సహాయపడతాయని ఎంతమందికి తెలుసు.? ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ మీరు విన్నది నిజమే.మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ముఖ్యమైన పోషకాలకు అరటిపండు పవర్ హౌస్ లాంటిది.ఆరోగ్యపరంగా అరటిపండు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.
ముఖ్యంగా ఆడవారికి అరటిపండ్లు ఒక వరమనే చెప్పుకోవచ్చు.నెలసరి సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల మూడ్ స్వింగ్స్, కాళ్లు లాగేయడం, నడుం నొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలు చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.
అయితే అరటి పండ్లు ఆయా సమస్యలకు సమర్థవంతంగా చెక్ పెడతాయి.అరటి పండులో విటమిన్ బి6( Vitamin B6 ) ఉంటుంది.
ఇది హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.మానసిక స్థితిని స్థిరీకరిస్తుంది.
కొన్ని భావోద్వేగ లక్షణాల తీవ్రతను తగ్గిస్తుంది.అదే సమయంలో నెలసరి నొప్పులను దూరం చేస్తుంది.
అరటి పండులో పొటాషియం( Potassium ) పుష్కలంగా ఉంటుంది.ఇది కండరాల సంకోచాలను నియంత్రించి.ఋతు తిమ్మిరి యొక్క తీవ్రత మరియు తగ్గింపుకు దోహదపడుతుంది.కండరాల నొప్పుల నుంచి చక్కని ఉపశమనాన్ని అందిస్తుంది.అలాగే అరటి పండులో మెగ్నీషియం కూడా ఉంటుంది.గర్భాశయ కండరాలను సడలించడానికి సహాయపడే ఖనిజాల్లో మెగ్నీషియం ఒకటి.
అదనంగా మెగ్నీషియం కటికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.ఇది నెలసరి నొప్పుల తీవ్రతను తగ్గిస్తుంది.
ఇక కొందరు నెలసరి సమయంలో కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాగా ఇబ్బంది పడుతుంటారు.అయితే అరటి పండులో ఫైబర్ అధికంగా ఉంది.ఇది జీర్ణ కదలికలను నియంత్రిస్తుంది.కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అజీర్తి తదితర జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.కాబట్టి ఇకపై నెలసరి సమయంలో ఖచ్చితంగా రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున అరటి పండ్లను తీసుకోండి.