శనగలు ప్ర‌యోజ‌నాలు తెలిస్తే.. రోజూ తినేస్తారు!

శనగలు.వీటి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

శ‌న‌గ‌ల‌ను చాలా మంది ఉడికించి తీసుకుంటారు.

అయితే ఉడికించి తీసుకున్నా, క‌ర్రీ రూపంలో త‌యారు చేసి తీసుకున్నా.

Health Benefits Of Chickpea! Health, Chickpea, Health Tips, Latest News, Health

శ‌న‌గ‌లు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.అయితే ఎంతో రుచిగా ఉండే శ‌న‌గ‌లు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అందించ‌డంలోనూ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

శ‌న‌గ‌ల్లో ఎన్నో పోష‌కాలు దాగున్నాయి.అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Advertisement

మ‌రి శ‌న‌గ‌లు తీసుకోవ‌డం వల్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.నేటి కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధించే స‌మ‌స్య అధిక బ‌రువు.

ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే అలాంటి వారు శ‌న‌గ‌ల‌ను డైట్‌లో చేర్చుకుంటే.

అందులో ఉండే ఫోలేట్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి.మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

మ‌రియు శ‌న‌గ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల ఎక్క‌వ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది.దీంతో వేరే ఆహారం తీసుకోలేరు.

అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!

త‌ద్వారా అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.అలాగే మ‌ధుమేహం ఉన్న వారు శ‌న‌గ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి వ‌స్తాయి.

Advertisement

మ‌రియు త‌క్ష‌ణ శక్తి ల‌భిస్తుంది.ఇక చాలా మంది అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డుతున్నారు.

అలాంటి వారు శ‌న‌గ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల.ఇందులో ఉండే పాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు బ్లడ్ షుగ‌ర్ లెవల్స్ అదుపులోకి తెస్తాయి.

అలాగే ర‌క్త‌హీన‌త త‌గ్గించ‌డంలోనూ.గుండె ఆరోగ్యం మెరుగుప‌ర‌చ‌డంలోనూ.

శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా ఆప‌డంలోనూ శ‌న‌గ‌లు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.మహిళలకు అవ‌స‌ర‌మ‌య్యే ఫోలిక్ యాసిడ్ కూడా శ‌న‌గ‌ల్లో ల‌భిస్తుంది.

ఇక శ‌న‌గ‌ల్లో పీచుపదార్థం పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అయ్యి.జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది.

కాబ‌ట్టి, శ‌న‌గ‌ల‌ను రెగ్యుల‌ర్‌గా కాక‌పోయినా.రెండు రోజులకు ఒక‌సారి అయినా తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి.

తాజా వార్తలు