ఏపీపై షర్మిల గురి కుదిరిందా ?

రాజకీయాల్లో ఎంత కష్టపడినా కూడా కొంత అదృష్టం కూడా కలిసి రావాలంటారు.

కొంతమంది నేతలు అతి తక్కువ సమయంలోనే అత్యంత కీలకమైన అధికారాలను కూడా రాజకీయాల్లో దక్కించుకోవడం మనం చూస్తూ ఉంటాం.

అయితే ఒకప్పుడు అన్న జగన్ కోసం మరోసారి తెలంగాణలో తమ పార్టీ మనుగడ కోసం రాష్ట్రంలో ఏ మహిళా రాజకీయ నేత చేయనటువంటి సుదీర్ఘ పాదయాత్రలు చేసిన చరిత్ర వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) కే సొంతం.అయితే ఆమె రెండు పాదయాత్రలతో కూడా ఆమెకు ఏ విధమైన రాజకీయ ప్రాధాన్యత దక్కకపోవడం బాధాకరం .అయితే ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర వరకూ తన అన్న జగన్ ను అధికారంలోకి తీసుకురావడం వరకూ ఆమె లక్ష్యం నెరవేరినా తెలంగాణలో పాదయాత్ర వల్ల మాత్రం కనీసం ఎమ్మెల్యే కూడా కాకపోవటం, పోటీకి పూర్తిగా దూరంగా ఉండటంతో ఆమె పూర్తిస్థాయి నిరాశలో ఉన్నట్లుగా తెలుస్తుంది.

ముఖ్యంగా కాంగ్రెస్తో పొత్తు( Congress ) సఫలమై ఉండుంటే ఆమె పార్టీ ఈ పాటికి అదికారం లో బాగం పంచుకుని మంత్రి పదవి కూడా దక్కించుకుని ఉండేవారు .అయితే పరిణామాలు అందుకు సహకరించకపోవడంతో వైఎస్ షర్మిల మద్దతు ఇచ్చి ఊరుకున్నారు.అయితే ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన బలంతో ఆంధ్రప్రదేశ్ వైపు కాంగ్రెస్ దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తుంది .మరికొన్ని రోజుల్లో రాహుల్ ,ప్రియాంకలు పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ పై దృష్టి పెడతారని, కాంగ్రెస్ ను వీడి వెళ్లిపోయ్యి ఇతర పార్టీలలో సెటిల్ అయిన కీలక నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి ఆకర్షించేలా గట్టి ప్రయత్నం చేయబోతునట్టుగా తెలుస్తుంది .కాంగ్రెస్( Congress ) ను ఆంధ్రప్రదేశ్ లో నిర్ణయాత్మక శక్తిగా మార్చడానికి తమ వంతు ప్రయత్నం చేయబోతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి .దానికోసం షర్మిల వంటి రాజకీయ నేపథ్యమున్న మహిళా రాజకీయ నేత ఉంటే బాగుంటుందని కాంగ్రెస్ అధిష్టానం కోరుకుంటుందట .అయితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పోటీపై ఇప్పటికీ షర్మిలకు స్పష్టమైన లక్ష్యం లేదని వార్తలు వస్తూ ఉండటంతో మరి షర్మిల రాజకీయ గమనం ఎటువైపు సాగుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే మారింది అని చెప్పుకోవాలి.

కాంగ్రెస్ మాత్రం ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రయాణానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి మాత్రం సిద్ధంగానే ఉంది .ఆ దిశగా కాంగ్రెస్ సి పిసిసి అధ్యక్షుడు రుద్రరాజు( Gidugu Rudraraj ) షర్మిల ఆంధ్ర కాంగ్రెస్కు వచ్చే అవకాశం ఉందని ఆమె వస్తే స్వాగతిస్తామంటూ ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు .ఇక బాల్ షర్మిల కోర్టులోనే ఉందని చెప్పుకోవాలి.

Advertisement
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

తాజా వార్తలు