'వీరమల్లు' కోసం అన్ని రోజులే కేటాయించిన పవన్.. మరి ముగిసేనా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

ఈ సినిమా తర్వాత కూడా వరుస సినిమాలు లైన్లో పెట్టడంతో ఆయన ఫ్యాన్స్ సంతోష పడ్డారు.అయితే భీమ్లా నాయక్ సినిమా వచ్చి నెలలు గడుస్తున్న మరో సినిమా షూటింగ్ ను పూర్తి చెయ్యలేదు.పవన్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్న కూడా ఈయన సెట్ లోకి అడుగు పెట్టలేదు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ మళ్ళీ సినిమాలకు డేట్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో హరి హర వీరమల్లు సినిమా ఒకటి.

ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇంకా 40 శాతం షూటింగ్ మిగిలి ఉండడంతో పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.అయితే ఇప్పుడు పవన్ ఈ సినిమా కోసం 50 రోజుల డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది.

Hari Hara Veera Mallu Shoot Update, Hari Hara Veera Mallu Shoot, Pawan Kalyan, H

బస్ యాత్ర పోస్ట్ పోన్ చేసుకున్న పవన్ తాను కమిట్ అయినా సినిమాల కోసం 3 నెలల సమయం కేటాయించగా సగం పూర్తి అయినా వీరమల్లు కోసం 50 రోజులు కేటాయించారట.నవంబర్ నుండి ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి డిసెంబర్ లో పూర్తి చేయాలనీ ప్లాన్ చేసుకున్నారని తెలుస్తుంది.

Hari Hara Veera Mallu Shoot Update, Hari Hara Veera Mallu Shoot, Pawan Kalyan, H

మొదటిసారిగా పవన్ పీరియాడిక్ యాక్షన్ సినిమాలో నటిస్తుండడం అలాగే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.ఇక కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాను 2023 మార్చిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

చూడాలి ఇన్ని రోజులు షూట్ వాయిదా పడ్డ ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో.

నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!

తాజా వార్తలు