పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.అయినా కూడా ఈయన కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారు.
ఈ క్రంమలోనే ప్రభాస్ ఇటీవలే మరో సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.ప్రెజెంట్ ప్రభాస్ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలు చేస్తున్నాడు.
ఇందులో ఆదిపురుష్ సినిమా షూట్ పూర్తి చేసుకుంది.ఇక ఇప్పుడు సలార్ తో పాటు ప్రాజెక్ట్ కే షూటింగులతో బిజీగా ఉన్నాడు.
ఈ రెండు చేస్తూనే మరో సినిమాను లైన్లో పెట్టాడు ప్రభాస్.ప్రభాస్ మారుతి దర్శకత్వంలో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆగష్టు 25న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసారు.ప్రస్తుతానికి ‘రాజా డీలక్స్‘ అనే టైటిల్ నే వర్కింగ్ టైటిల్ గా పెట్టి మారుతి సినిమాను స్టార్ట్ చేసాడు.
అయితే ఇటీవలే ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణం రాజు గారు మరణంతో ఈయన షూటింగులకు బ్రేక్ ఇచ్చాడు.దీంతో అన్ని సినిమాల షూట్ ఆగిపోయింది.
కానీ మారుతి మాత్రం తెలివిగా ప్రభాస్ లేకుండానే షూట్ స్టార్ట్ చేసినట్టు ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.మారుతి ఈ సినిమాలో నటిస్తున్న మాస్టర్ బ్యూటీ మాళవిక మోహనన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.
![Telugu Salaar, Maruthi, Marutistart, Prabhas, Project, Raja Deluxe-Movie Telugu Salaar, Maruthi, Marutistart, Prabhas, Project, Raja Deluxe-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/09/Project-K-Salaar-Director-Maruthi-Raja-Deluxe-1.jpg)
ఇటీవలే ఈ భామ హైదరాబాద్ లో కనిపించడంతో ఈ వార్తలకు మరింత ఊతం వచ్చింది.మారుతి ప్రభాస్ లేని సన్నివేశాలను షూట్ చేస్తున్నాడు అని తెలుస్తుంది.త్వరలోనే ప్రభాస్ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.అయితే మారుతి ఏ అప్డేట్ ఇవ్వక పోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేసిన ఈ సినిమాను ఫాస్ట్ గా ముగించే ప్లాన్ లో ఉండడంతో ఖుషీగా ఉన్నారు.