యూకేలో భారత సంతతి మహిళపై బహిష్కరణ వేటు.. సిక్కు కమ్యూనిటీ బాసట, ఆన్‌లైన్‌లో పిటిషన్

దేశ బహిష్కరణకు గురైన భారత సంతతి సిక్కు మహిళకు మద్ధతుగా యూకేలో( UK ) ప్రజలు ఒక్కటవుతున్నారు.

ఆమె బహిష్కరణను రద్దు చేయాలని , యూకేలో నివసించేందుకు అవకాశం కల్పించాలని కుల, మతం, ప్రాంతాలకు అతీతంగా అండగా నిలుస్తున్నారు.

ప్రధానంగా ఇంగ్లాండ్‌లోని వెస్ట్‌ మిడ్‌లాండ్స్( West Midlands ) ప్రాంతంలో ఆమెకు ప్రజలు బాసటగా నిలుస్తున్నారు.బహిష్కరణను అడ్డుకునేందుకు జూలై 2020 నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్ పిటిషన్‌పై దాదాపు 65,000 మంది సంతకాలు చేశారు.

ఇటీవల "వి ఆర్ ఆల్ గుర్మిత్ కౌర్" అనే క్యాంపెయినింగ్ సోషల్ మీడియాలో విస్త్రతంగా జరుగుతోంది.

Gurmit Kaur Sikh Community Fights For Elderly Woman Facing Deportation From Uk D

కౌర్( Gurmit Kaur ) తిరిగి భారతదేశానికి వెళ్లడానికి పంజాబ్‌లో( Punjab ) ఆమెకు సంబంధించిన కుటుంబీకులు ఎవ్వరూ లేరు.అందుచేత స్మెత్‌విక్‌లోని స్థానిక సిక్కు కమ్యూనిటీ గుర్మిత్ కౌర్‌ను దత్తత తీసుకుంది.కానీ గుర్మిత్‌కు పంజాబ్‌లోని తన స్వగ్రామంలోని కొందరు వ్యక్తులతో ఇప్పటికీ పరిచయం వుందని, అక్కడ మిగిలిన జీవితాన్ని కొనసాగించగలదని యూకే హోమ్ ఆఫీస్ వాదిస్తోంది.

Advertisement
Gurmit Kaur Sikh Community Fights For Elderly Woman Facing Deportation From UK D

వ్యక్తిగత కేసులపై వ్యాఖ్యానించలేనప్పటికీ.అన్ని దరఖాస్తులు వారి వ్యక్తిగత అర్హతలపై, అందించిన సాక్ష్యాధారాల ఆధారంగా పరిశీలన జరుగుతాయని స్పష్టం చేసింది.

Gurmit Kaur Sikh Community Fights For Elderly Woman Facing Deportation From Uk D

గుర్మిత్ కౌర్ (78) 2009లో యూకేకి వచ్చి స్మెత్‌విక్‌లో నివసిస్తున్నారు.ఓ వివాహంలో పాల్గొనేందుకు గాను బ్రిటన్‌కు వచ్చి కొన్నాళ్లు కొడుకుతో కలిసి జీవించారు.బ్రస్‌స్ట్రోక్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇమ్మిగ్రేషన్ సలహాదారు సల్మాన్ మీర్జా.

( Salman Mirza ) గుర్మిత్ కౌర్‌కు అండగా నిలిచారు.ఆన్‌లైన్ పిటిషన్‌తో పాటు వీసా అప్పీళ్ల ప్రక్రియలో ఆయన ఆమెకు సాయం చేస్తున్నారు.

గుర్మిత్‌కు స్వగ్రామంలో వున్న ఇల్లు పాడుబడిపోయిందని, ఈ వయసులో ఆమె అక్కడికి వెళ్లడం మరణం వంటిదని సల్మాన్ అభివర్ణించారు.కుటుంబం నుంచి దూరమైన తర్వాత గుర్మిత్ . దాతల సహాయ సహకారాలపైనే ఆధారపడుతున్నారని ఆయన తెలిపారు.ప్రజల నుంచి ఒత్తిడి, నిరసనల నేపథ్యంలో గుర్మిత్ విషయంలో బ్రిటన్ ప్రభుత్వం పునరాలోచిస్తుందేమో చూడాలి.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు