'గుంటూరు కారం' అప్డేట్.. ఒక రోజు వాయిదా తర్వాత భారీ ఫైట్ షూట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ మధ్యనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసుకుంది.

సమ్మర్ ముందు వాయిదా పడిన ఈ సినిమా ఈ మధ్యనే స్టార్ట్ చేసుకుని ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఆ తర్వాత వెంటనే కొద్దీ గ్యాప్ తోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.

భారీ మాస్ యాక్షన్ ఫైట్ ను చిత్రీకరిస్తున్నారని తెలిసింది.అయితే వర్షం కారణంగా ఈ షెడ్యూల్ కు ఒక రోజు అంతరాయం కలిగిందట.

దీంతో నెక్స్ట్ డే వెంటనే షూట్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.నిన్న స్టార్ట్ అవ్వగా భారీ మాస్ ఫైట్ ను షూట్ చేస్తుందని టాక్.

Advertisement

కెజిఎఫ్ సినిమాలకు కంపోజ్ చేసిన అనల్ అరసు ఆధ్వర్యంలో ఈ ఫైట్ జరుగుతుంది.మరి ఈ షెడ్యూల్ ఎప్పటికి ముగుస్తుందో చూడాలి.

కాగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి( Sreeleela ) హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.

ఇదిలా ఉండగా త్రివిక్రమ్, మహేష్ బాబు( Trivikram ) కాంబో ఇప్పటికే రెండు సార్లు వచ్చింది.అతడు, ఖలేజా రెండు కూడా డిఫరెంట్ జోనర్స్ అయిన త్రివిక్రమ్ టేకింగ్, మహేష్ బాబు మాస్ డైలాగ్స్ అలరించాయి.ఇక ఇప్పుడు పూర్తిగా మహేష్ ను మాస్ లుక్ లోకి మార్చేసి గుంటూరు కారం తెరకెక్కిస్తున్నాడు.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్11, శుక్రవారం 2025

దీంతో ఈసారి కూడా బ్లాక్ బస్టర్ ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.చూడాలి ఈసారి ఈ కాంబో ఎలా అలరిస్తుందో.

Advertisement

తాజా వార్తలు