పాపం.. గృహలక్ష్మి సీరియల్ నటి ప్రశాంతి కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రస్తుతం బుల్లితెర పై మంచి రేటింగ్ తో దూసుకెళ్తున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

పైగా అందులో ఉన్న పాత్రలు కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.అందులో తులసి, నందు, లాస్య పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సీరియల్ మొత్తం ఈ ముగ్గురు పైనే కొనసాగుతుంది.ఇందులో లాస్య అలియాస్ ప్రశాంతి విలన్ పాత్రతో బాగా మెప్పిస్తుంది.

ఇక ఈమె మొత్తానికి నందుని పెళ్లి చేసుకొని అనుకున్నది సాధించుకుంది.ఈ సీరియల్ తో ప్రశాంతి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Advertisement
Gruhalakshmi Serial Actress Prasanthi Real Life Difficulties Details, Gruhalaks

కెరీర్ మొదట్లో ప్రశాంతి యాంకర్ గా పలు షోలలో చేసింది.యాంకర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.

వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.కానీ ఎందుకో అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.

ఒక నటిగా కంటే, యాంకర్ గా కంటే వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.ఇక ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో విలన్ పాత్ర తో మళ్లీ మంచి సక్సెస్ అందుకుంది.

ఈ గ్లామర్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన హాట్ ఫోటోలతో కుర్రాళ్లను బాగా పిచ్చెక్కిస్తుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా ముచ్చట్లు పెడుతుంది.

Advertisement

తన డాన్స్ వీడియోలతో మాత్రం కుర్రాళ్ళను ఫిదా చేస్తుంది.

తాజాగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.అందులో తను ఎండలో బాగా కష్టపడుతున్నట్లు కనిపించింది.ఎర్రటి ఎండలో షూటింగ్ చేస్తుండటంతో ఆమెకు దిమ్మతిరిగి పోగా.

ఏసీ లేదు కదా.అని అంటే నువ్వు ఉన్నావు కదా అంటూ పక్కన ఆటోలో కూర్చుంది.ఇక దివ్య కూడా ఉండగా తనతో కలిసి బాగా అల్లరి చేసినట్లు కనిపించింది.

ఆ వీడియోను చూసిన నెటిజన్లు పాపం లాస్య కు బాగానే కష్టాలు ఉన్నాయి కదా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

తాజా వార్తలు