చర్మాన్ని యవ్వనంగా కాంతివంతంగా మెరిపించే గ్రీన్ టీ.. ఎలా వాడాలంటే?

గ్రీన్ టీ( Green Tea ) అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా జీవించే పానీయాల్లో ఒకటి.

ఆరోగ్యం పై శ్రద్ధతో చాలా మంది రెగ్యులర్ టీ, కాఫీలకు బదులు గ్రీన్ టీ ను ఎంపిక చేసుకుంటున్నారు.

గ్రీన్ టీ బరువు నిర్వహణకు మద్దతు ఇస్తుంది.చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

అంతేకాదండోయ్‌ చర్మాన్ని యవ్వనంగా( Youthful Skin ) కాంతివంతంగా మెరిపించే సత్తా కూడా గ్రీన్ టీ కి ఉంది.మరి ఇంతకీ చర్మానికి గ్రీన్ టీ ను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Green Tea Makes The Skin Look Youthful And Radiant Details, Green Tea, Green Te

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసుకోవాలి.అలాగే పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు,( Organic Turmeric ) వన్ టీ స్పూన్ బాదం నూనె( Badam Oil ) మరియు వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ప‌దిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Green Tea Makes The Skin Look Youthful And Radiant Details, Green Tea, Green Te

వారానికి రెండు సార్లు ఈ సింపుల్ హోమ్‌ రెమెడీని పాటించడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు.ముఖ్యంగా గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ మరియు వృద్ధాప్య సంకేతాలతో పోరాడటానికి సహాయపడతాయి.అదే సమయంలో చర్మాన్ని యవ్వనంగా కాంతివంతంగా మెరిపిస్తాయి.

Green Tea Makes The Skin Look Youthful And Radiant Details, Green Tea, Green Te

గ్రీన్ టీ మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి మరియు దాని మృదుత్వాన్ని పెంచడానికి తోడ్పడుతుంది.మొండి మొటిమలు, మచ్చలను నివారించడంలో కూడా గ్రీన్ టీ తోడ్పడుతుంది.ఇక పెరుగు, పసుపు మ‌రియు బాదం నూనె.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

ఇవి చర్మానికి చక్కని పోషణ అందిస్తాయి.చర్మం ఆరోగ్యంగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.

Advertisement

పొడి చర్మాన్ని నివారిస్తాయి.

తాజా వార్తలు