టీడీపీ కి గవర్నర్ ఆఫర్ .. ఆ ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ ? 

ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి లు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని చేపట్టడం, కేంద్రంలో బిజెపికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు లేకపోవడం,  తదితర కారణాలతో టిడిపికి ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారు బిజెపి అగ్రనేతలు.

ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి , జనసేన,  బిజెపి కూటమి 164 సీట్లను దక్కించుకున్నాయి.

కేంద్రంలో బిజెపికి తగిన మెజార్టీ రాకపోవడంతో ఎన్డీయే లోని మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.దీనిలో టిడిపి కీలక భాగస్వామిగా ఉండడంతో, ఆ పార్టీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

బిజెపి అగ్ర నేతలు.దీనిలో భాగంగానే గవర్నర్ పోస్ట్ ను టిడిపి అధినేత సూచించిన వారికి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం .ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా చంద్రబాబుకు చేరిందట.

Governors Offer To Tdp.. Which Of The Two Has A Chance, Tdp, Janasena, Bjp, Ch

ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నేతల పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారట.ఇక టిడిపి నుంచి గవర్నర్ రేసులో చాలామంది ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.గతంలో బిజెపితో పొత్తు ఉన్న సమయంలో గవర్నర్ పదవి విషయంలో చంద్రబాబు చాలామందికి హామీ ఇచ్చారు.

Advertisement
Governor's Offer To TDP.. Which Of The Two Has A Chance, TDP, Janasena, BJP, Ch

అయితే అప్పట్లో అది సాధ్యం కాలేదు .ఇప్పుడు టిడిపి ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండడంతో గవర్నర్ పదవిని టిడిపి సూచించిన వారికే ఇవ్వనున్నారు.ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అలాగే కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పేర్లు తెరపైకి వచ్చాయి.

వీరిలో ఒకరిని గవర్నర్ పదవి కి చంద్రబాబు సూచించే అవకాశం కనిపిస్తోంది.

Governors Offer To Tdp.. Which Of The Two Has A Chance, Tdp, Janasena, Bjp, Ch

గతం నుంచి టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య( Varla Ramaiah ) పేరు కూడా వినిపిస్తూ వచ్చేది .అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నేపథ్యంలో అశోక్ గజపతిరాజు లేదా యనమాల రామకృష్ణుడులలో ఒకరికి గవర్నర్ పదవి దక్కబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ప్రస్తుతం ఏపీలో మంత్రులుగా ఎంపికైన వారికి శాఖలు కేటాయించే విషయంలో చంద్రబాబు బిజీగా ఉండడంతో , ఆ తరువాత గవర్నర్ పదవికి ఎవరి పేరును సూచించాలనే దానిపై పార్టీ కీలక నేతలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు