Governor Tamilisai Soundararajan Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని సత్కరించిన గవర్నర్ తమిళిసై..!!

దేశ అత్యున్నత రెండో పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi )కి ఇటీవల కేంద్రం ప్రకటించడం తెలిసిందే.

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు జనవరి 25వ తారీకు తెలుగు రాష్ట్రాలకు చెందిన మెగాస్టార్ చిరంజీవికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు( Venkaiah Naidu )కి అవార్డులు ప్రకటించడం జరిగింది.

కరోనా లాంటి కష్ట కాలంలో సినీ కార్మికులకు చేసిన సేవలను గుర్తించి చిరంజీవికి కేంద్రం ఈ అవార్డు ప్రకటించటం జరిగింది.ఈ క్రమంలో చాలామంది సినిమా ప్రముఖులు రాజకీయ నాయకులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు.

సినిమా ఇండస్ట్రీ( Film Industry )కి చెందిన చాలామంది దర్శకులు మరియు నిర్మాతలు చిరంజీవి నివాసానికి వెళ్లి గౌరవించడం జరిగింది.

Governor Tamilisai Soundararajan Chiranjeevi : మెగాస్టార్ �

తెలంగాణ మంత్రులు కూడా చిరంజీవి నివాసానికి వెళ్లి సత్కరించారు.మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా సత్కరించడం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై( Telangana Governor Tamilisai Soundararajan ) దంపతులు రాజ్ భవన్ లో మెగాస్టార్ చిరంజీవిని సత్కరించడం జరిగింది.

Advertisement
Governor Tamilisai Soundararajan Chiranjeevi : మెగాస్టార్ �

ఈ కార్యక్రమానికి చిరంజీవి తన సతీమణి సురేఖతో కలసి హాజరయ్యారు.ఈ ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి."నాకు ఆతిథ్యం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు.

తమిళిసై.ఆమె భర్త సౌందరరాజన్ తో మాట్లాడినందుకు ఎంతో ఆనందంగా ఉందని" చిరంజీవి రాసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు