ఎఫ్ 3 కథ ఇదేనంటూ పుకార్లు.. కథ ఏంటంటే..?

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కి 2019 సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదలైన ఎఫ్ 2 సినిమా సంచలన విజయం సాధించింది.

ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా తెరకెక్కుతోంది.

ఈ ఏడాది ఆగష్టు నెల 27వ తేదీన ఎఫ్ 3 సినిమాను విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటన వెలువడింది.అయితే ఎఫ్ 3 సినిమా కథ ఇదేనంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక స్టోరీ తెగ వైరలవుతోంది.

వైరల్ అవుతున్న కథ ప్రకారం సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తున్న తమన్నా, మెహ్రీన్ మితిమీరిన ఖర్చులు చేస్తారు.భార్యలు చేస్తున్న మితిమీరిన ఖర్చుల కోసం భర్తలు అప్పులు చేయాల్సి వస్తుంది.

వెంకటేష్, వరుణ్ అప్పులు భారీగా పెరగడంతో ఒక హోటల్ పెడతారని హోటల్ పెట్టిన తరువాత ఎదురయ్యే సమస్యలు వెంకీ, వరుణ్ లకు ఫ్రస్టేషన్, ప్రేక్షకులకు ఫన్ తెప్పిస్తాయని తెలుస్తోంది.

Advertisement

కథ సాధారణ కథలానే ఉన్నా అనిల్ రావిపూడి తనదైన మార్కు కామెడీతో సినిమాను మరో లెవెల్ కు తీసుకెళతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే వైరల్ అవుతున్న కథలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.ఈ సినిమాకు భారీ బడ్జెట్ ఖర్చవుతోందని దిల్ రాజు ఈ సినిమా కోసం 80 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది.

అయితే తెలుగులో ఇప్పటివరకు సీక్వెల్స్ హిట్ కావడం అరుదుగా జరిగింది.ఎఫ్ 3 సీక్వెల్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.ఎఫ్ 3 సినిమాకు అనిల్ రావిపూడి 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుండగా వెంకటేష్, వరుణ్ తేజ్ 8 కోట్ల రూపాయల చొప్పున పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించడంతో సినిమా షూటింగ్ వేగంగా జరిగేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ను ఆ హీరోతో చేయాల్సిందా..?
Advertisement

తాజా వార్తలు