గ్లిజరిన్ + రోజ్ వాటర్ అద్భుతమైన ప్రయోజనాలు

సాధారణంగా గ్లిజరిన్ అంటే అందరికి గుర్తుకు వచ్చేది సినిమాల్లో కన్నీరు రావటానికి ఉపయోగిస్తారని.కానీ గ్లిజరిన్ లో మరొక కోణం ఉంది.

గ్లిజరిన్ గొప్ప సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు.గ్లిజరిన్ నీటిలో సులభంగా కలిసిపోతుంది.

గ్లిజరిన్ లో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాస్తే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

గ్లిజరిన్ ముఖం మీద ఉన్న దుమ్మును, ధూళిని తొలగించటానికి చాలా బాగా సహాయాపడుతుంది.రోజ్ వాటర్ టోనర్ గా పనిచేస్తుంది.

Advertisement
Glycerin And Rose Water Beauty Benefits, Glycerin, Rose Water, Beauty Benefits,

ఈ రెండింటికి బ్లీచింగ్ ఏజెంట్ అయిన నిమ్మరసాన్ని జోడిస్తే అద్భుతమైన ప్రయోజనం కలుగుతుంది.ఒక బౌల్ లో ఒక స్పూన్ గ్లిజరిన్, ఒక స్పూన్ రోజ్ వాటర్, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము,ధూళి అన్ని తొలగిపోతాయి.

Glycerin And Rose Water Beauty Benefits, Glycerin, Rose Water, Beauty Benefits,

రెండు స్పూన్ల శనగపిండిలో ఒక స్పూన్ గ్లిజరిన్, ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా చేయటం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది.ఒక స్పూన్ రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్ మొశ్రమంలో అర టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ను కలపండి.

ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి పట్టించి మరుసటి రోజు గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు